Blast by Naxals : ఛత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లాలో నక్సల్స్ పేలుడు…సీఆర్‌పీఎఫ్ జవానుకు గాయాలు
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....

Helicopter
Blast by Naxals : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుడు ఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడ్డారు. గాయపడిన జవాన్ ను హెలికాప్టరులో ఆసుపత్రికి తరలించారు. నక్సలైట్ల పేలుడు ఘటనతో సాయుధ పోలీసుల పహరాను ముమ్మరం చేశారు.
Also Read : Iranian Nobel laureate Narges Mohammadi : నోబెల్ బహుమతి గ్రహీత నర్గెస్ జైలులో నిరాహార దీక్ష…ఎందుకంటే…
కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఐఈడీ పేలుడులో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులు గాయపడ్డారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే నక్సల్స్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ను పేల్చారు. నక్సలైట్ల పేలుళ్లలో గాయపడిన జవాన్ కోబ్రా బెటాలియన్ కు చెందిన వాడని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. గాయపడిన జవాన్ ను ఆసుపత్రికి తరలించారు.
Also Read : Drunk school teacher : పీకలదాకా మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోయిన టీచర్…ఆపై ఏం జరిగిందంటే…
మంగళవారం ఛత్తీస్ ఘడ్, మిజోరం ప్రాంతాల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సాయుధ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడటంతో సుక్మాజిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.