Iranian Nobel laureate Narges Mohammadi : నోబెల్ బహుమతి గ్రహీత నర్గెస్ జైలులో నిరాహార దీక్ష…ఎందుకంటే…

ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఖైదీలకు ఇరాన్ వైద్య సంరక్షణ నిరాకరించడం, హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరసన చేపట్టారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.....

Iranian Nobel laureate Narges Mohammadi : నోబెల్ బహుమతి గ్రహీత నర్గెస్ జైలులో నిరాహార దీక్ష…ఎందుకంటే…

Iranian Nobel laureate Narges Mohammadi

Updated On : November 7, 2023 / 7:05 AM IST

Iranian Nobel laureate Narges Mohammadi : ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఖైదీలకు ఇరాన్ వైద్య సంరక్షణ నిరాకరించడం, హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరసన చేపట్టారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. 51 సంవత్సరాల వయసున్న నర్గేస్ మొహమ్మది గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. నర్గెస్ గుండె , ఊపిరితిత్తులకు చికిత్స అవసరం కానీ ఆమెను ఆసుపత్రికి తరలించడాన్ని ప్రాసిక్యూటర్ అడ్డుకుంటున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.

మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి

ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం నార్వేజియన్ నోబెల్ కమిటీ అధ్యక్షురాలు ప్రదానం చేశారు. ఆసుపత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన అమానవీయం, నైతికంగా ఆమోదయోగ్యం కాదని బెరిట్ రీస్-ఆండర్సన్ అన్నారు. ఎవిన్ జైలులో మహిళా హక్కుల ప్రచారకర్త నిరాహార దీక్ష ప్రారంభించారని జైలు వర్గాలు తెలిపాయి.

జైలులో అనారోగ్యానికి గురైనా చికిత్స చేయించలేదు…

పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ మొహమ్మదీని ఒక వారం పాటు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడాన్ని ఒక ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. మొహమ్మదీకి అత్యవసర వైద్య చికిత్స కోసం గుండె, ఊపిరితిత్తుల కేంద్రానికి తరలించాలని వైద్యులు సిఫార్సు చేసినా చికిత్స అందించలేదు. అత్యున్నత అధికారుల ఆదేశాల ప్రకారం ఆమె తలకు స్కార్ఫ్ లేకుండా గుండె ఆసుపత్రికి పంపడం నిషేధించామని జైలు వార్డెన్ ప్రకటించారు.

Also Read : Israel-Hamas : ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు ఫట్…అంతర్జాతీయ కార్మిక సంస్థ సంచలన నివేదిక

ఇరాన్‌లోని డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మది ప్రస్తుతం 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈమెను ఇరాన్ పోలీసులు 13 సార్లు అరెస్ట్ చేయగా, అయిదు సార్లు దోషిగా నిర్దారించారు. ఈమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించారు.

Also Read : Drunk school teacher : పీకలదాకా మద్యం తాగి తరగతి గదిలో నిద్రపోయిన టీచర్…ఆపై ఏం జరిగిందంటే…

ఇరాన్ దేశంలో షరియా చట్టం ప్రకారం మహిళలు తప్పనిసరిగా తమ జుట్టును తలపై కండువాతో కప్పుకోవాలి. గత ఏడాది హిజాబ్ వ్యవహారంలో ఇరాన్ యువతి మహసా అమిని పోలీసు కస్టడీలో మరణించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించారు.