DRDO Internships Recruitment: డీఆర్డీవో ఇంటర్న్‌షిప్ రిక్రూట్‌మెంట్.. 165 పోస్టులు.. రూ.5 వేలు స్టైఫండ్.. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్
DRDO Internships Recruitment: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒక ప్రధాన యూనిట్ అయిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ లాబొరేటరీ ఇంటర్న్‌షిప్‌ల రిక్రూట్‌మెంట్ 2025ని ప్రకటించింది.

DRDO Internships Recruitment 2025
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒక ప్రధాన యూనిట్ అయిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ లాబొరేటరీ ఇంటర్న్‌షిప్‌ల రిక్రూట్‌మెంట్ 2025ని ప్రకటించింది. ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రాలలో చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న(B.E./B.Tech, M.Sc, M.E/M.Tech (Final Year)) విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ అందించనున్నారు. ఆరు నెలపాటు సాగనున్న ఈ ట్రైనింగ్ జులై 6 నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ జులై 1 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. మొత్తం 165 మందిని సెలెక్ట్ చేసి ఇంటర్న్‌షిప్ అందించనున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ లో సెలెక్ట్ అయినవారికి నెలలకి రూ.5000 స్టైఫండ్ అందించనున్నారు. ఎంపికైన ఇంటర్న్‌లు హైదరాబాద్‌లోని DRDL, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ASL) మరియు సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (CAS)లోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో కలిసి పని చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఏ ఏ బ్రాంచ్ లకు ఎన్ని పోస్టులు:
- EE (ఎలక్ట్రానిక్స్, ECE, ఎంబెడెడ్ సిస్టమ్స్,VLSI, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) 58 పోస్టులు
- ME (మెకానికల్,కెమికల్ , ఎయిరో స్పేస్, ప్రొడక్షన్, మెటీరియల్, etc) 75 పోస్టులు
- PH ( ఫిజిక్స్, కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్, అల్లైడ్ సైన్స్) 8 పోస్టులు
- CS (కంప్యూటర్ సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఆలైడ్) 24 పోస్టులు
విద్యార్హతలు: సంబంధిత ఇంజనీరింగ్ లేదా సైన్స్ విభాగాలలో అన్ని సెమిస్టర్లలో కనీసం 60% మార్కులతో B.E./B.Tech, M.Sc, M.E/M.Tech పూర్తి చేసినవారు. లేదా చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
అర్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను, అవసరమైన అన్ని పత్రాలు, ధృవపత్రాలతో పోస్ట్ ద్వారా పంపాల్సి ఉటుంది. స్కాన్ చేసిన కాపీని drdlintern2025@gmail.com కు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:
డైరెక్టర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL),
డాక్టర్ APJ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్,
డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్, P.O. కాంచన్‌బాగ్,
హైదరాబాద్, తెలంగాణ – 500 058
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్ట్ చేయడం: అభ్యర్థులను తమ విద్యా పనితీరు, అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు జూలై 26న ఇంటర్వ్యూ ఉంటుంది.
తుది ఎంపిక: ఇంటర్వ్యూ, విద్యా అర్హతలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.