ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు

ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్-C లెవెల్ 2 టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. కోల్ కత్త, పశ్చిమ బెంగాల్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
అభ్యర్ధులు పదో తరగతి, ఐటిఐ పాస్ కావాల్సి ఉంటుంది. 10వ తరగతితో ఐటిఐ చదువు ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.
వయసు:
అభ్యర్ధలు 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 1, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 1, 2019.
Read Also: అప్లై చేసుకోండి: ఇండియన్ రైల్వేలో 2వేల 600 ఖాళీలు