Engineering courses
Engineering Courses : ఇంటర్మీడియట్ తరువాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యాను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు, భారీ వేతనాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుతం పరిశోధన, అవిష్కరణలకు ప్రాధన్యత నివ్వటంతోపాటుగా, ఉపాధి అవకాశాలు లభించే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం మారుతున్న సాంకేతికత నేపధ్యంలో విద్యార్ధుల్లో సామర్ధ్యాల పెంపు దిశగా ఇంజనీరింగ్ విద్య అడుగులు వేస్తుంది.
READ ALSO : Uttar Pradesh : జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు
ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆకోర్సుల్లో చేరేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అలాగని ఇతర కోర్సులు తక్కువేం కాదు. ఇంజనీరింగ్ లోని ఇతర అనేక కోర్సులను చదివిన వారికి మంచి ఉపాధి అవకాశాలు దొరకటమే కాకుండా, భారీ వేతనాలను అందుకుంటున్నారు. అలాంటి కోర్సులేమిటో తెలుసకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : IPGL Recruitment 2023 : ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ
బయోమెడికల్ ఇంజనీరింగ్ ;
బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఇంజనీరింగ్ సూత్రాల అన్వయయించటానికి సంబంధించింది. బయోమెడికల్ ఇంజనీర్లు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వైద్య పరికరాలు, ప్రక్రియలను రూపొందిస్తారు. ప్రతిరోజు ఉపయోగించే బయోమెడికల్ పరికరాలైన పేస్‌మేకర్‌లు, బ్లడ్ గ్లూకోజ్ మానిటర్‌లు , కృత్రిమ అవయవాలు వంటి వాటికి ఇంజినీరింగ్ ప్రిన్సిపుల్స్ జతకూర్చటంలో బయోమెడికల్ ఇంజనీర్స్ కీలకంగా చెప్పవచ్చు. హెల్త్ కేర్ రంగాన్ని మరింతగా మెరుగుపర్చడం లో బయోమెడికల్ ఇంజనీర్లు కీలకం కావటంతో ప్రస్తుతం వీరికి డిమాండ్ పెరిగింది. మేనేజ్‌మెంట్, లేబొరేటరీ వర్క్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వేతనాలు కూడా భారీగానే అందుకోవచ్చు.
READ ALSO : 26/11 Mumbai attacks : 26/11 ముంబయి ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు… లష్కరేతోయిబాను ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్ ప్రకటన
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ;
భూమిపైన, వాతావరణంలో , అంతరిక్షంలో పనిచేసే వాహనాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం , నిర్వహణకు సంబంధించిన ఇంజనీరింగ్ రంగం . ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్, వాటికి సంబంధించిన పరికరాల అభివృద్ధిలో వీరు కీలకపాత్ర పోషిస్తారు. ఇటీవల కాలంలో ఈ రంగంలో ఉద్యోగవకాశాలు క్రమేపి పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు ఏరోడైనమిక్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, స్ట్రక్చరల్ డిజైన్, మెటీరియల్స్, ఏవియానిక్స్ మరియు స్టెబిలిటీ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి వాటిలో ప్రత్యేక డిజైన్ బృందాలతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రవాణా మరియు యుద్ధ విమానాలు , క్షిపణి, అంతరిక్ష నౌక, సాధారణ విమానయాన పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏరో స్పేస్ ఇంజనీర్స్‌కు జీతాలు భారీగానే ఉన్నాయి.
READ ALSO : Jaggery Tea : బరువు తగ్గటంతోపాటు, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కోసం బెల్లం టీ !
కెమికల్ ఇంజనీరింగ్ ;
కెమికల్ ఇంజనీర్లు మనం ప్రతిరోజూ ఉపయోగించే అనేక ఉత్పత్తుల తయారీలో వారిదే కీలక భూమిక. ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఆహారం, దుస్తులు మరియు కాగితం వంటి ప్రత్యక్ష రసాయన తయారీతో పాటు వివిధ రకాల తయారీ పరిశ్రమలలో కెమికల్ ఇంజనీర్ల పాత్ర ఉంటుంది. గణితం మరియు సైన్స్, ముఖ్యంగా రసాయన శాస్త్రంపై పట్టున్నవారు కెమికల్ ఇంజనీర్లుగా రాణించవచ్చు. ప్రస్తుత కెమికల్ ఇంజనీర్స్‌కు విస్తృతస్ధాయిలో కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాలు, పెట్రోలియం రిఫైనరీలు, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్, పల్ప్ మరియు పేపర్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పెషాలిటీ కెమికల్స్, పాలిమర్స్, బయోటెక్నాలజీ మరియు ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇండస్ట్రీస్ తదితర వాటిల్లో ఉపాధి అవకాశాలతోపాటు, మంచి వేతనాలు లభిస్తున్నాయి.
READ ALSO : Air Quality and Kidney Health : వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పే ! తస్మాత్ జాగ్రత్త
మెకానికల్ ఇంజనీరింగ్ :
మెకానికల్ ఇంజనీరింగ్ అనేది గణితం, భౌతిక శాస్త్రం మరియు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లతో కలగలిసిన విద్య. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. చమురు & గ్యాస్ పరిశ్రమ, ఏరోస్పేస్ పరిశ్రమ, రైల్వే రంగం, థర్మల్ పరిశ్రమ,ఆటోమొబైల్ పరిశ్రమ, రోబోటిక్స్ పరిశ్రమ వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. డిజైన్ ఇంజనీర్, మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి. మంచి వేతనాలు కూడా పొందవచ్చు.
READ ALSO : Election Commission : తెలంగాణలో రైతులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ;
విద్యుత్ మరియు ఎలక్ట్రికల్ ఉపకరణాలు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. దీంతో విద్యుత్తును ఉత్పత్తి ,విద్యుత్ పరికరాలు వంటి వాటికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది పవర్ జనరేషన్‌తో సహా విద్యుత్ సాంకేతికతపై దృష్టిసారిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి మరియు విద్యుత్ ఉపకరణాలు, భారీ విద్యుత్ యంత్రాల తయారీ యొక్క ప్రధాన ఉద్దేశ్యంతో వ్యవహరించే కంపెనీలు, పరిశ్రమలలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి వేతనాలను సైతం అందుకోవచ్చు.