BNP Dewas Recruitment : బ్యాంక్ నోట్ ప్రెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ సిల్క్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 ఏళ్లలోపు ఉండాలి.

BNP Dewas Recruitment : బ్యాంక్ నోట్ ప్రెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

BNP Dewas Recruitment

Updated On : July 23, 2023 / 12:59 PM IST

BNP Dewas Recruitment : మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 సూపర్ వైజర్, జూనియర్ టెక్నీషియన్ తోపాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోవడం నిజమేనా?

పోస్టుల ఖాళీలకు సంబంధించి సూపర్ వైజర్ ప్రింటింగ్ 8 , సూపర్ వైజర్ కంట్రోల్ 3, సూపర్ వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 4 , జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ 27, జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ 25 ఖాళీలు ఉన్నాయి. వాటితోపాటు జూనియర్ టెక్నీషియన్స్ వివిధ విభాగాల్లో 23 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Vitamin D Deficiency : విటమిన్ డి లోపంతో గుండెజబ్బులు వస్తాయా ?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ సిల్క్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా ఆగస్టు 21, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; bnpdewas.spmcil.com పరిశీలించగలరు.