NHB Recruitment : నేషనల్ హౌజింగ్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 నుండి 55 ఏళ్లు ఉండాలి. నెలకు వేతనంగా 48,170 నుండి 129000 వరకు చెల్లిస్తారు.

NHB Recruitment :
NHB Recruitment : న్యూదిల్లీలోని నేషనల్ హౌజింగ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్, రీజినల్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఫైనాన్స్, లీగల్ రికవరీ, కంపెనీ సెక్రటరీ, క్రెడిట్ ఎంఐఎస్, ఎకనమిస్ట్, ఐటీ, ప్రొటొకాల్ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 నుండి 55 ఏళ్లు ఉండాలి. నెలకు వేతనంగా 48,170 నుండి 129000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా ఫిబ్రవరి 6 , 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.nhb.org.in పరిశీలించగలరు.