BARC Recruitment : భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌, ఫిజక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

BARC Recruitment : భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

BARC Recruitment 2022 Apply Online

Updated On : October 11, 2022 / 11:55 AM IST

BARC Recruitment : ముంబయిలోని భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 రిసెర్చ్‌ అసోసియేట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మెకానికల్ డిజైన్, డిజైన్ ప్రిపరేషన్‌ రిపోర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, ఇన్‌స్పెక్షన్‌, క్యూఏ అండ్‌ టెస్టింగ్‌ ఎట్‌ సప్లయర్స్ షాప్‌, ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ కమిషనింగ్‌, ఆర్ అండ్‌ డీ ఇన్‌ ఫిజిక్స్‌, కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీ, హైడ్రోజన్‌ ఎనర్జీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌, ఫిజక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రిసెర్చ్‌ అసోసియేట్‌-1 పోస్టులకు నెలకు రూ.47000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు. రిసెర్చ్‌ అసోసియేట్‌-2 పోస్టులకు నెలకు రూ.49000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు. రిసెర్చ్‌ అసోసియేట్‌-3 పోస్టులకు నెలకు రూ.54000తో పాటు ఇతర అలవెన్సులు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : డిప్యూటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్-V, సెంట్రల్ కాంప్లెక్స్, BARC, ట్రాంబే, ముంబై–400085 పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.barc.gov.in/careers/recruitment.html పరిశీలించరు.