ONGC Recruitment : ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో పంపాల్సి ఉంటుంది.

ONGC Recruitment : ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Filling up of executive posts in Oil and Natural Gas Corporation Limited

Updated On : September 21, 2022 / 4:17 PM IST

ONGC Recruitment : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్జీసీ)లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌,పెట్రోలియం ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ongcindia.com/ పరిశీలించగలరు.