చెక్ ఇట్: FCI JE అడ్మిట్ కార్డ్ విడుదల

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 01:44 PM IST
చెక్ ఇట్: FCI JE అడ్మిట్ కార్డ్ విడుదల

Updated On : May 16, 2019 / 1:44 PM IST

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)లో మే 16న వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల చేసింది. FCIలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

FCIలో మొత్తం 4103 జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్-2, స్టెనో గ్రేడ్-2, టైపిస్ట్, అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 30 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు మే, జూన్ నెలల్లో ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూలు విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.