GATE 2025 Registration : గేట్ 2025 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా..!
GATE 2025 Registration : గేట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు వివిధ డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

GATE 2025 Registration Begins Today, Check Details ( Image Source : Google )
GATE 2025 Registration : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ గేట్ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు గేట్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ఫిబ్రవరి 1, 2, 15, 16, 2025 తేదీలలో పరీక్ష షెడ్యూల్ అయింది. గేట్ 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించనున్నారు.
నగర కేంద్రాలను 8 జోన్‌లుగా విభజించారు. గేట్ ఫలితాలు మార్చి 19, 2025న ప్రకటించనున్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను గేట్ 2025 వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది. గేట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు వివిధ డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ల జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
గేట్ 2025 అర్హత ప్రమాణాలు :
అభ్యర్థులు దరఖాస్తును సమర్పించే ముందు గేట్ 2025 కోసం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మూడో లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల్లో ఉన్న అభ్యర్థులు లేదా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్‌లో ఏదైనా ప్రభుత్వ ఆమోదం పొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన అభ్యర్థులు గేట్ పరీక్షకు అర్హులు.
గేట్ 2025 పేపర్ ప్యాట్రన్ :
గేట్ 2025 మోడల్ 30 పరీక్షా పత్రాలను కలిగి ఉంటుంది. అభ్యర్థులు ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్‌లను ఎంచుకోవచ్చు. పరీక్ష వ్యవధి 3 గంటలు, గేట్ స్కోర్‌లు ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి. పరీక్షలో 3 ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి. మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు (MCQ), మల్టీ ఆప్షన్ ప్రశ్నలు (MSQ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు. రీకాల్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్‌పై అభ్యర్థులు ఎవాల్యుషన్ చేస్తారు.
గేట్ పరీక్ష అనేది వివిధ అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి విభాగాలలో అభ్యర్థుల తమ పరిజ్ఞానాన్ని అంచనా వేసే పరీక్ష. ఇందులో పాస్ అయిన అభ్యర్థులు ఆర్థిక సహాయంతో మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చు. గేట్ స్కోర్‌లను రిక్రూట్‌మెంట్ ప్రక్రియల కోసం విద్యా సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు (PSU) ఉపయోగిస్తాయి.