Instagram New Update : ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫొటోలకు కూడా టెక్స్ట్, స్టిక్కర్లు యాడ్ చేయొచ్చు..!
Instagram New Update : ఈ స్టిక్కర్ ఆప్షన్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫాంట్‌లు, యానిమేషన్‌లు, రీల్స్, స్టోరీలలో ఎఫెక్ట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అప్‌డేట్ చేసిన టెక్స్ట్ టూల్ వివిధ రకాల కొత్త ఫాంట్‌లను అందిస్తుంది.

Instagram now allows users to add texts, stickers to photos
Instagram New Update : ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. ఇకపై యూజర్లు ఇన్‌స్టా ఫొటోలకు టెక్స్ట్, స్టిక్కర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. కంటెంట్ కస్టమైజ్ చేయడం ద్వారా మరింత ఆకర్షణీయంగా చేసే కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు వినియోగదారులను ఫొటోలకు టెక్స్ట్, స్టిక్కర్‌లను యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే యాప్‌లో వ్యూ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేసేందుకు అనేక ఇతర క్రియేటివిటీ టూల్స్‌తో పాటు ఫొటోలు, కరోజల్ రెండింటికీ టెక్స్ట్, స్టిక్కర్‌లను యాడ్ చేయొచ్చు.
Read Also : Moto G45 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G45 5జీ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
ఈ ఫీచర్ యూజర్లకు మరింత క్రియేటివిటీని అందిస్తుంది. కంటెంట్‌ను కొత్త స్టయిల్లో కస్టమైజడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఒకే ఫొటో లేదా కరోజల్ పోస్ట్ అయినా, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్ ఫాంట్‌లను ఉపయోగించి టెక్స్ట్ వాడొచ్చు. స్క్వైర్స్, సర్కిల్‌లు, హార్ట్ లేదా స్టార్స్ మార్చగలిగే స్టిక్కర్‌లను యాడ్ చేయొచ్చు. ఫొటోల ద్వారా స్టోరీకి సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్ యాడ్ చేయొచ్చు.
ఈ ఫీచర్ కోసం వినియోగదారులు వారి గ్యాలరీ నుంచి ఫొటోను ఎంచుకుని టెక్స్ట్ బటన్‌ను ట్యాప్ చేయాలి. స్టిక్కర్లను యాడ్ చేసేందుకు టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న గ్యాలరీ బటన్ యూజర్లు వారి పోస్ట్‌లపై ఇతర ఫొటోలను లేయర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ టూల్ ఎలిమెంట్‌లను కలపడం, కంపేర్ చేయడం సులభం చేస్తుంది. ప్రత్యేకమైన, ఆకర్షించే కంటెంట్‌ను రూపొందించడంలో క్రియేటర్లకు సాయపడుతుంది.
ఈ టెక్స్ట్, స్టిక్కర్ ఆప్షన్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫాంట్‌లు, యానిమేషన్‌లు, రీల్స్, స్టోరీలలో ఎఫెక్ట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అప్‌డేట్ చేసిన టెక్స్ట్ టూల్ వివిధ రకాల కొత్త ఫాంట్‌లను అందిస్తుంది. వీటిని యానిమేట్ చేయవచ్చు లేదా ఎఫెక్ట్‌లతో యాడ్ చేయొచ్చు. కరోజల్ పోస్ట్‌లను గతంలో 10కి పరిమితం కాగా ఇప్పుడు కరోజల్ పరిమితి ఒక్కో పోస్ట్‌కు 20 ఫొటోలు, వీడియోలకు విస్తరించింది.
ఈ మార్పుతో వినియోగదారులకు వారి క్రియేటివిటీకి మరింత అవకాశం అందిస్తుంది. ఒకే పోస్ట్‌లో లాంగ్ స్టోరీలు లేదా వైడ్ రేంజ్ మూవెంట్స్ క్యాప్చర్ చేయడం, షేర్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్‌లు యూజర్ల కోసం మరిన్ని క్రియేటివిటీ ఆప్షన్లను ఇన్‌స్ట్రాగ్రామ్ తీసుకురానుంది. ఈ కొత్త టూల్స్‌తో ఒకే ఫొటో, కరోజల్ లేదా డైనమిక్ రీల్‌లు, స్టోరీల ద్వారా ప్రత్యేకంగా క్రియేట్ చేసుకోవచ్చు.
Read Also : iQOO Z9s First Sale : ఈ నెల 29 నుంచే ఐక్యూ జెడ్9ఎస్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, కీలక స్పెషిఫికేషన్లు ఇవే..!