Agniveer Vayu Recruitment: అగ్నివీర్ వాయు దరఖాస్తు గడువు పొడగింపు.. అప్లికేషన్ లింక్, పూర్తి వివరాలు మీకోసం
Agniveer Vayu Recruitment: అగ్నివీర్ వాయు పోస్టుల నియామకానికి సంబందించిన దరఖాస్తు గడువును పొడిగించింది.

IAF Agniveer Vayu application deadline extended
భారత వైమానిక దళం (IAF) గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీర్ వాయు పోస్టుల నియామకానికి సంబందించిన దరఖాస్తు గడువును పొడిగించింది. ముందు చేసిన షెడ్యుల్ ప్రకారం దరఖాస్తు చివరి తేదీ జులై 31గా ఉండేది. ఇప్పుడు ఆ తేదీని ఆగస్టు 4వ తేదీకి పొడిగించారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in నుంచి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి పరీక్షలో గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఐటీ)లో కనీసం 50% మార్కులతో పాటు, ఇంగ్లీషులో 50% మార్కులను కలిగి ఉండాలి. నాన్-సైన్స్ కేటగిరీ అభ్యర్థులు 12వ తరగతిలో ఏదైనా స్ట్రీమ్ నుండి కనీసం 50% మార్కులతో, ఇంగ్లీషులో కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి. అంతేకాకండా.. కనీసం 50% మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 17.5 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 21 సంవత్సరాలుగా ఉండాలి.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు అందరూ రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక నాలుగు దశలలో జరుగుతుంది. రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష.