చెక్ ఇట్ : IBPS లో 2 వేలకు పైగా క్లర్క్ ఉద్యోగాలు…. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

IBPS Clerk recrutiment 2020: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్(IBPS) లో క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేస్తూ, మరోసారి దరఖాస్తులను కోరుతుంది. ఇందులో మెుత్తం 2557 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయినా అభ్యర్దులు అక్టోబర్ 23, 2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2557 క్లర్క్ పోస్టులను కంప్యూటర్ బేస్ టెస్టు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23, 2020తో పూర్తిగా… ప్రస్తుతం మరోసారి అధికారిక పోర్టల్ ద్వారా ఐబీపీఎస్ దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 85, తెలంగాణలో 62 పోస్టులున్నాయి. అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
ఏదైనా స్ట్రీమ్ లేదా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం అక్కడి స్థానిక భాషను మాట్లాడగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయసు : అభ్యర్ధుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: SC,ST, PWED అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి. జనరల్ అభ్యర్దులు రూ.850 చెల్లించాలి.
ముఖ్య తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 23, 2020.
దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 6, 2020.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: డిసెంబర్ 5, 12, 13, 2020.
మెయిన్స్ పరీక్ష తేది: జనవరి 24, 2021.