IBPS, RRBలో 9వేలకు పైగా పీవో, క్లర్క్ జాబ్స్

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) లో పివో, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 9698 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్దులు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.
విభాగాల వారీ ఖాళీలు:
ఆఫీస్ అసిస్టెంట్ : 4682
ఆఫీసర్ స్కేల్ I : 3800
ఆఫీసర్ స్కేల్ II(General Banking Officer) : 838
ఆఫీసర్ స్కేల్ II(Agricultural Officer) : 100
ఆఫీసర్ స్కేల్ II(IT) : 59
ఆఫీసర్ స్కేల్ II(Law) : 26
ఆఫీసర్ స్కేల్ II(CA) :26
ఆఫీసర్ స్కేల్ II(Marketing Officer) : 8
ఆఫీసర్ స్కేల్II(Treasury Manager) : 3
ఆఫీసర్ స్కేల్ III : 156
విద్యార్హత : అభ్యర్దులు బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, లా పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ.850 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై 1, 2020.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 21, 2020.