IBPS Recruitment 2025: IBPS SO నోటీఫికేషన్ విడుదల.. 5208 పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు మీకోసం

IBPS Recruitment 2025: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ సహా పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

IBPS Recruitment 2025: IBPS SO నోటీఫికేషన్ విడుదల.. 5208 పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు మీకోసం

IBPS SO 2025 Notification released

Updated On : July 4, 2025 / 12:10 PM IST

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ సహా పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో స్పెషలిల్స్ ఆఫీసర్స్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్, హిందీ ఆఫీసర్‌, ప్రొబిషనరీ ఆఫీసర్‌, బ్యాంకర్ ఫాకల్టీతోపాటు డివిజన్ హెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించారు. అర్హత, ఆసక్తి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని అధికారులు సూచించారు. మరి దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • ఎనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్ పోస్ట్ 1
  • స్పెషలిస్టు ఆఫీసర్స్ పోస్టుల వివరాలు:
  • హిందీ ఆఫీసర్‌ పోస్టు 1
  • డివిజన్ హెడ్‌ పోస్టు 1
  • డివిజన్ హెడ్‌ పోస్టు 1
  • బ్యాంకర్‌ ఫ్యాకల్టీ పోస్టు 1
  • బ్యాంకర్‌ ఫ్యాకల్టీ టెక్నికల్‌ పోస్టు 1
  • ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులు 5,208
  • బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:
  • బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో 700 పోస్టులు
  • బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్రలో 1000 పోస్టులు
  • బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో 1000 పోస్టులు
  • పంజాబ్ అండ్ సింద్‌ బ్యాంక్లో 358 పోస్టులు
  • కెనరా బ్యాంక్‌లో 1000 పోస్టులు
  • సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 450 పోస్టులు
  • పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో 200 పోస్టులు

విద్యార్హతలు:

ప్రొబిషనరీ ఆఫీసర్‌: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్పెషలిస్ట్ ఆఫీసర్: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎనలిస్ట్ ప్రోగ్రామర్‌: పైథాన్- కంప్యూటర్‌ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్/బీఈలో ఎంసీఏ/ఎంఎస్‌సీ,ఐటీ/కంప్యూటర్ సైన్స్‌ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఐటీ ఆఫీసర్స్‌: ఈ జాబ్స్ కి నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో పూర్తి చేసినవాళ్లు, కంప్యూటర్‌ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్ టెలీకమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్లో డిగ్రీ చేసిన వాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్రికల్చరల్‌ ఫీల్డ్ ఆఫీసర్‌: అగ్రికల్చర్‌/హార్టీకల్చర్‌/ యానింల్‌ హజ్బెండరీ/వెటరినరీ సైన్స్/ డెయిరీసైన్స్‌/ఫిషరీ సైన్స్‌/ చేపల పంపకంలో సైన్స్/అగ్రీ మార్కెటింగ్‌ అండ్ కోపరేషన్/ కోఆపరేషన్ అండ్‌ బ్యాంకింగ్/ అగ్రోఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్‌ బయోటక్నాలజీ/బీటెక్‌ బయోటక్నాలజీ/ఫుడ్‌ సైన్స్/ అగ్రీకల్చర్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌/ ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రీకల్చరల్‌ ఇంజినీరింగ్/సెరీ కల్చర్‌/ ఫిషరీస్‌లో ఇంజనీరింగ్‌ నాలుగేళ్ల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

రాజ్‌భాషా అధికారి: హిందీలో డిగ్రీ చేసి ఇంగ్లీష్‌ ఒక సబ్జెట్‌కుగా ఉన్నవాళ్లు, సంస్కృతంలో పీజీ చేసిన వాళ్లు ఈ జాబ్స్ ఐ అప్లై చేసుకోవచ్చు.

లా ఆఫీసర్స్‌: ఎల్‌ఎల్‌బీ చేసి బార్‌ కౌన్సిల్‌లో ఎన్రోల్‌ అయిన వాళ్లు ఈ జాబ్స్ కి అర్హులు.

హెచ్‌ఆర్‌/పర్శనల్‌ ఆఫీసర్‌: పర్శనల్ మేనేజ్మెంట్‌/ఇండస్ట్రీయర్ రిలేషన్/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్‌/లో పీజీ కానీ, పీజీడిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి.

మార్కెటింగ్ ఆఫీసర్‌: ఎంబీఏ(మార్కెటింగ్)/పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీడీబీఏ/పీజీపీఎ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ చేసినవారి ఉండాలి.

హిందీ ఆఫీసర్‌: హిందీలో డిగ్రీ/పీజీ చేసినవారి ఉండాలి. వారికి ఇంగ్లీష్‌ మేజర్ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా ఉండాలి.

డివిజన్ హెడ్‌: ఏదైనా యూనివర్శిటీ/ఇనిస్టిట్యూట్ నుంచి కామర్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి.

డివిజన్ హెడ్‌: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్‌/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్ లో డిగ్రీ/పీజీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

బ్యాంకర్స్‌ ఫ్యాకల్టీ: ఏ సబ్జెక్ట్‌లోనైనా డిగ్రీ/పీజీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

బ్యాంకర్ ఫ్యాకల్టీ/టెక్నికల్‌: ఏదైనా యూనివర్శిటీ/ఇనిస్టిట్యూట్‌ నుంచి బీటెక్/ బీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.in లోకి వెళ్ళాలి
  • అందులో రీసెంట్ అప్‌డేట్స్ పై క్లిక్ చేయాలి
  • అక్కడ పోస్టులు వివరాలు కనిపిస్తాయి.
  • మీరు దేనికి అర్హులో ఆ పోస్టుపై క్లిక్ చేయాలి.
  • అక్కడ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • తరువాత మీ వివరాలతో లాగిన్ అవ్వాలి
  • అక్కడ అప్లికేషన్ పూర్తి గా ఫీల్ చేయాలి.
  • తరువాత మీ విద్యార్హత, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్స్ ను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత ఫీజు చెల్లించి సబ్‌మిట్‌ చేయాలి.