ICMR Recruitment : ఐసీఎంఆర్ రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ లో ఉద్యోగ ఖాళీలు భర్తీ

అభ్యర్ధుల వయసు 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 9, 11, 14, 16, 18, 21 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ICMR Recruitment : ఐసీఎంఆర్ రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ లో ఉద్యోగ ఖాళీలు భర్తీ

ICMR Regional Medical Research Center Job Vacancies

Updated On : October 22, 2022 / 8:41 PM IST

ICMR Recruitment : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పోర్టు బ్లెయిర్‌లోని ఐసీఎంఆర్ – రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, డీఈవో, సైంటిస్ట్‌ సీ, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌/ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ/లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ/ సోషల్‌ సైన్సెస్‌లో ఎంఏ/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/ఎంబీఎస్‌సీ/ఎంటెక్‌/ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 9, 11, 14, 16, 18, 21 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా: ICMR- రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, డాలీగంజ్, పోర్ట్ బ్లెయిర్ మరియు ICMR న్యూఢిల్లీ. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rmrcbbsr.gov.in పరిశీలించగలరు.