IDBI బ్యాంకులో సీఏ, మేనేజర్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 06:49 AM IST
IDBI బ్యాంకులో సీఏ, మేనేజర్ పోస్టులు

Updated On : March 25, 2019 / 6:49 AM IST

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 26 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా SC, ST అభ్యర్థులు రూ.150, ఇతరులు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. 

* విద్యా అర్హత: 
సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్, MBA లేదా PG ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  
   
* ఎంపిక విధానం:
మెరిట్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత మార్కులను జనరల్/EBC అభ్యర్థులకు 50గా, ST, SC, OBC దివ్యాంగులకు 45 మార్కులుగా నిర్ణయించారు. 

* వయసు పరిమితి:
01.03.2019 నాటికి DGM పోస్టులకు 35 నుంచి 45 సంవత్సరాలు, AGM పోస్టులకు 28 నుంచి 36 సంవత్సరాలు, మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

* పోస్టుల సంఖ్య:  

            పోస్టులు       పోస్టుల సంఖ్య
డిప్యూటీ జనరల్ మేనేజర్           03
అసిస్టెంట్ జనరల్ మేనేజర్           05
మేనేజర్           32
మొత్తం ఖాళీలు           40

* ముఖ్యమైన తేదీలు..
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం  :  మార్చి 26, 2019.
– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది        :  ఏప్రెల్ 08, 2019.