IDBI బ్యాంకులో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 500 ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 300 ఖాళీలు మొత్తం 800 ఖాళీలు ఉన్నాయి.
* విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా విభాగంలో 60% డిగ్రీ అర్హత ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
* వయసు పరిమితి:
01.03.2019 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
* దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 15.04.2019.
ఆన్‌లైన్ పరీక్ష తేది: 17.05.2019.