IIT Bombay
QS World University Rankings 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి 2023 సబ్జెక్ట్ వారీగా క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలించింది. ప్రపంచవ్యాప్తంగా 47వ స్థానంలో నిలవగా, ఈ సంస్థ 100కి 80.4 స్కోర్ ను సాధించింది. భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యలో క్రియాశీలకమైన బాధ్యతలను నిర్వర్తించటంలో ఐఐటి బాంబే రాణించడం పట్ల ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గుర్తింపును సాధించడంలో విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సహకారం అందించినందుకు ఆయన అభినందించారు.
READ ALSO : Karthika Masam 2023 : కార్తీకమాసం స్నానాలతో ఆరోగ్య రహస్యాలు..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి 2022 వచ్చిన ర్యాంగింగ్స్ కంటే పనితీరులో 18 స్థానాలు మెరుగుపడినట్లైంది. ఇంజినీరింగ్ & టెక్నాలజీ, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ మరియు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌తో సహా మొత్తం 5 కోర్సులలో ఈ సంస్థ 4 కోర్సుల్లో ర్యాంక్ సాధించింది. ఇన్‌స్టిట్యూట్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో (51-100), కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 66వ ర్యాంక్, సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌కు 51-100, కెమికల్ ఇంజనీరింగ్‌లో 77వ ర్యాంక్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 54వ ర్యాంక్ , మెకానికల్, ఏరోనాటికల్ & మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌కు 68వ స్థానం, మినరల్స్ & మైనింగ్‌కు 37వ స్థానం సాధించినట్లు IIT బాంబే అధికారులు స్పష్టం చేశారు.
READ ALSO : High Salary Courses : ఇంటర్ తరువాత ఈ కోర్సులు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు తెలుసా !
మొత్తం QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో, IIT బాంబే ప్రపంచవ్యాప్తంగా 172వ స్థానంలో ఉండగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది. గతంలో అనగా 2022లో IIT బాంబే మొత్తం QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 177వ స్థానంలో నిలిచి భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుత ర్యాకింగ్స్ లో మొదటి స్ధానాన్ని పదిలపరుచుకుంది.
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో ఐఐటీ బాంబే 40వ ర్యాంక్, ఐఐటీ ఢిల్లీ 46వ ర్యాంకు, ఐఐటీ మద్రాస్ 53వ ర్యాంక్ , ఐఐఎస్‌సీ బెంగళూరు-58, ఐఐటీ ఖరగ్‌పూర్-59, ఐఐటీ కాన్పూర్-63, ఢిల్లీ యూనివర్సిటీ-94, ఐఐటీ గౌహతి-111, ఐఐటీ రూర్కీ-116, జేఎన్‌యూ-117 ర్యాంకులు సాధించాయి.
మనదేశంలో విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యారంగంలో ప్రమాణాలు గతంకంటే మెరుగుపడ్డాయి. ఈ క్రమంలోనే భారతదేశ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సైతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ చోటు దక్కించుకోవటం చూస్తుంటే ఇదే స్పష్టమౌతుంది. ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ వర్సిటీలు చోటుదక్కించుకోగా చైనా మనకంటే వెనుకడటం విశేషం. తాజా ర్యాంకింగ్స్‌లో చైనా నుంచి 133 యూనివర్సిటీలు, జపాన్ నుంచి 96 యూనివర్సీటీలు ర్యాంకులు మాత్రమే పొందాయి. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాకింగ్స్2024లో మనదేశం నుంచి 148 యూనివర్సిటీలు స్ధానం దక్కించుకున్నాయి.
READ ALSO :Karthika Masam 2023 : శివకేశవులకు ప్రీకరమైన కార్తీక మాసం, కోటి పుణ్యఫలాలు ప్రసాదించే మహిమాన్విత మాసం
ఇదిలా వుంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2024లో బీజింగ్ కి చెందిన పెకింగ్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. కీలకమైన 11 సూచికలలో ఒకటైన అకడమిక్ ప్రతిభలో పెకింగ్ యూనివర్సిటీ మంచి స్కోర్ సాధించింది. రెండో స్థానంలో హాంకాంగ్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 3వ స్థానంలో నిలిచాయి. అలాగే సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని సిన్హువా యూనివర్సిటీ నాలుగో ర్యాంకు లభించింది.
తాజా ర్యాంకింగ్స్‌లో భారత వర్సిటీల ప్రాతినిధ్యం బాగా పెరిగినట్లు QS సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెన్ సౌటర్ చెప్పారు. ఇది భారత్‌లో ఉన్నత విద్యారంగం విస్తరణను దోహదపడుతుంది. రానున్న రోజుల్లో ప్రపంచ విద్యాసంస్థలతో పోటీ పడటానికి ఈ ర్యాంకింగ్స్ ప్రోత్సాహకంగా పనిచేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.