India Post Recruitment 2023 : ఇండియా పోస్ట్ లో ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్ , మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీ

అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు 22 నవంబర్ 2022 గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా 06 డిసెంబర్ 2022న విడుదల చేస్తారు.

India Post Recruitment 2023 : ఇండియా పోస్ట్ లో  ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్ , మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీ

India Post Recruitment 2023 (1)

India Post Recruitment 2023 : ఇండియా పోస్ట్ లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. పోస్టల్ సర్కిల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం క్రీడాకారుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు డిసెంబర్ 9, 2023 లోపు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Leopard : చెట్టు ఇనుపతీగలో చిక్కుకు పోయిన చిరుతపులి…ఎలా కాపాడారంటే…వీడియో వైరల్

అర్హతలు ;

పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు గాను గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌లో పని చేసే పరిజ్ఞానం కలిగి ఉండాలి.

పోస్ట్‌మ్యాన్ / మెయిల్ గార్డ్ పోస్టులకు గాను గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. సంబంధిత పోస్టల్ సర్కిల్ లేదా డివిజన్ యొక్క స్థానిక భాషను 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఒకటిగా ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం ఉండాలి. ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి మోటారు వాహనం నడపడానికి లైసెన్స్ (పోస్ట్‌మ్యాన్ పోస్టుకు మాత్రమే), వైకల్యం ఉన్న వ్యక్తులు లైసెన్స్ నుండి మినహాయింపు వర్తిస్తుంది.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకుగాను గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

READ ALSO : SIDBI Officers Recruitment 2023 : SIDBI అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ.. ఖాళీల వివరాలు

క్రీడా నైపుణ్యం ;

నోటిఫికేషన్‌ ప్రకారం ఏదైనా క్రీడలు/గేమ్‌లలో జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలో రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులై ఉండాలి. అలాగే ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లలో తమ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులై ఉండాలి. ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పాఠశాలల కోసం జాతీయ క్రీడలు/గేమ్స్‌లో రాష్ట్ర పాఠశాల జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు అర్హులు. నేషనల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ డ్రైవ్ కింద ఫిజికల్ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు అర్హులు.

READ ALSO : Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?

 

ఇండియా పోస్టుల రిక్రూట్‌మెంట్ 2023కు దరఖాస్తు చేయటం ఎలా ?

అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో “https://dopsportsrecruitment.in”లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ. 100/-గా నిర్ణయించారు.

స్టేజ్ 1 ; ముందుగా అధికారిక వెబ్ సైట్ www.dopsportsrecruitment.in ఓపెన్ చేయాలి.

స్టేజ్ 2 ; అందులో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి..

READ ALSO : Karthika Masam 2023 : శివకేశవులకు ప్రీకరమైన కార్తీక మాసం, కోటి పుణ్యఫలాలు ప్రసాదించే మహిమాన్విత మాసం

స్టేజ్ 3 ; వెంటనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలోనే ఫీజును చెల్లించవచ్చు.

స్టేజ్ 4; అనంతరం స్పోర్ట్స్ కు సంబంధించి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆపై సర్కిల్‌ను ఎంచుకోవాలి.

స్టేజ్ 5; చివరిగా సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.