SIDBI Officers Recruitment 2023 : SIDBI అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ.. ఖాళీల వివరాలు

ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ వంటి ప్రక్రియలు ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూకి గరిష్ట మార్కులు ఒక్కొక్క దానికి100మార్కులు. గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

SIDBI Officers Recruitment 2023 : SIDBI అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ.. ఖాళీల వివరాలు

SIDBI A Recruitment 2023

SIDBI Officers Recruitment 2023 : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SIDBI ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 8 నుండి ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరి గడువు నవంబర్ 28, 2023గా నిర్ణయించారు.

READ ALSO : School Teacher : 14 ఏళ్ల విద్యార్థితో పాఠశాల మహిళా టీచర్ లైంగిక సంబంధం…నిందితురాలి అరెస్ట్

ఖాళీల వివరాలు ;

మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనుండగా వాటిలో జనరల్ 22, ఎస్సీ 11, ఎస్టీ 8, ఓబీసీ 4, ఈడబ్ల్యుఎస్ 5 పోస్టులను ఆయా కేటగిరిల వారీగా కేటాయించారు.

అర్హతలు ;

దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థుల విద్యార్హత విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ లో CA/CS/CWA/CFA/CMA/CMA నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా లాలో బ్యాచిలర్ డిగ్రీ/ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

READ ALSO : Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

ఎంపిక ప్రక్రియ ;

ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ వంటి ప్రక్రియలు ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూకి గరిష్ట మార్కులు ఒక్కొక్క దానికి100మార్కులు. గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలను లక్నో, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము ;

SC / ST / PwBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ₹ 175/- , ఇతరులకు ₹ 1100/-. చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి. వివరాల కోసం అభ్యర్థులు SIDBI అధికారిక వెబ్‌సైట్‌ను https://www.sidbi.in/en పరిశీలించగలరు.

READ ALSO : Unique ID Number : మొబైల్ యూజర్ల కోసం యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది.. ఇక మోసాలకు చెక్ పడినట్టే!

SIDBI రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చేయటం ఎలాగంటే ?

స్టేజ్ 1 ; స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.sidbi.inని ఓపెన్ చేయండి

స్టేజ్ 2 ; హోమ్‌పేజీలో, ఎగువన కనిపించే “కెరీర్స్”పై క్లిక్ చేయాలి. అన్ని రిక్రూట్‌మెంట్‌లతో కూడిన పేజీ కనిపిస్తుంది. జనరల్ స్ట్రీమ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-A’ దరఖాస్తు అని చూపించే దానిపై క్లిక్ చేయాలి.

స్టేజ్ 3 ; SIDBI గ్రేడ్ ‘A’-జనరల్ స్ట్రీమ్‌లో ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు పై క్లిక్ చేయాలి.

స్టేజ్ 4 ; అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ కోసం కొత్త రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయాలి. ఓపేన్ అయిన తరువాత పేరు, వివరాలు , ఇమెయిల్-ఐడిని నమోదు చేసుకోవాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ , పాస్‌వర్డ్ క్రియేట్ అవుతుంది.

స్టేజ్ 5 ; క్రియేట్ చేసిన లాగిన్ పాస్వర్డ్ తో పేజీలోకి లాగినై SIDBI గ్రేడ్ A అప్లికేషన్ ఫారమ్ లో అవసరమైన వివరాలను పూర్తి చేయాలి.