Karthika Masam 2023 : శివకేశవులకు ప్రీకరమైన కార్తీక మాసం, కోటి పుణ్యఫలాలు ప్రసాదించే మహిమాన్విత మాసం

కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది.

Karthika Masam 2023 : శివకేశవులకు ప్రీకరమైన కార్తీక మాసం, కోటి పుణ్యఫలాలు ప్రసాదించే మహిమాన్విత మాసం

Karthika Masam

Karthika Masam 2023 : కార్తీక మాసం. తెలుగు నెలల్లో చాలా విశిష్టత కలిగిన మాసం. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు ఇలా సౌభాగ్యాలు కలిగించే గౌరీ దేవి..సిరి సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవి పూజలకు ప్రసిద్ది చెందిన మాసం. కానీ కార్తీక మాసం మాత్రం గౌరీదేవి, లక్ష్మీదేవిల పతులు (భర్తలు) అయిన శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం అంతా శివాలయాలు, విష్ణు ఆలయాలలో ఆధ్మాత్మిక భావనతో మారుమోగిపోతాయి. అభిషేక ప్రియుడైన శివయ్యకు అభిషేకాలు..అలంకార ప్రియుడైన శ్రీ మహా విష్ణువుకు సర్వాలంకాలతో పాటు విశిష్ట పూజలు జరుగుతాయి.

శివకేశవులకు అంత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం అంతా ప్రతీ రోజు ఆధ్మాకతతో నిండిపోతుంది. ఉదయం లేచి మహిళలు కార్తీక స్నానాలు, దీపాలు, పూజలు, వ్రతాలు, పురాణ పఠనాలతో ఆధ్మాత్మిక భావనతోనే నిండిపోతారు. ప్రతీ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుంటుంది. గుమ్మానికి మామిడి తోరణాలు..పచ్చని పసుపు..ముచ్చటైన ముగ్గులతో గడపలు..గుమ్మాలు వెలిగిపోతుంటాయి.

పూజలు చేసిన మహిళలు ఉపవాసాలతో శివకేశవులను ధ్యానిస్తారు. పురాణాలు చదువుతు ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానాలు చేసిన కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలి..దేవాలయాలకు వెళ్లి శివకేశవులను పూజిస్తారు. దాన ధర్మాలు చేసి కుటుంబాలకు మేలు కలగాలని..భర్త, పిల్లలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శివకేశవులను కోరుకుంటారు.

Diwali 2023 : దీపావళి రోజు గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొడతారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..?

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలను తొలగించి, అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం. ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆథ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీక మాసం పరమేశ్వరునికే కాదు శ్రీ మహావిష్ణుకు కూడా ఎంతో ప్రీతికరమైంది.ఈ మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని నమ్ముతారు. మహిళలు, పురుషులు కార్తీకమాసంలో తప్పనిసరిగా వేకుమ జామున బ్రహ్మముహూర్తంలో లేచి ఆచరించాలని పండితులు చెబుతుంటారు.

కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయం, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అనంతమైన ఫలాలు లభిస్తాయి. శివాలయ గోపురాన్ని వీక్షిస్తే సాక్షాత్తు పరమశివుడి సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు. శివాలయం గోపురం దర్శనం, శిఖర దర్శనం, శివలింగ సన్నిధిలో దీపారాధన చేస్తే అన్ని పాపాలు నశించిపోయి అనంత కోటి పుణ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

Diwali 2023 : దీపావళి రోజు గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొడతారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..?

కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, అవి అందుబాటులో లేకపోతే కనీసం ఆముదంతో గానీ దీపారాధ చేస్తే కోటి పుణ్యఫలాలు అందుతాయని పండితులు చెబుతున్నారు. అలా చేసినవారికి మోక్షం కలుగుతుందని శివ పురాణం చెబుతోంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగించే శక్తి..కార్తీక మాసం పూజలకు ఉందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఏమీ అందుబాటులో లేకపోయినా ఎంత పేదవారైనా సరే..భక్తితో చిన్న దీపం వెలిగించి హృదపూర్వకంగా శివకేశవులను ప్రార్థిస్తే వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూజ చేసే విధానంలో నియమాలు ఉన్నా..భయ భక్తులు మాత్రం అత్యంత ప్రధానమైనవని మర్చిపోకూడదు. భక్తి ఎప్పుడు మెప్పు కోసం కాదు మోక్షం కోసం చేయాలని తెలుసుకోవాలి.