Diwali 2023 : దీపావళి రోజు గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొడతారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..?

దీపావళి రోజు చిన్నారులతో గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొట్టిస్తారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..? ఈ దివిటీలు కొట్టటం వెనుక ఉన్న రహస్యమేంటి..?

Diwali 2023 : దీపావళి రోజు గోంగూర కర్రలతో దివిటీలు ఎందుకు కొడతారు ..? గోంగూరకు దీపావళికి సంబంధమేంటి..?

Diwali divinits

Diwali 2023 : దీపావళి రోజు చిన్న పిల్లలతో పెద్దలు దగ్గరుండి దివిటీలు కొట్టిస్తారు. చిన్నపిల్లలు మాత్రమే దివిటీలు కొడతారు. ఇంటి ముందు నిలబెట్టి దివిటీలు అంటే గోంగూర కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిలాంటి బట్టను కట్టి..దాన్ని దీపంతో వెలిగించి..కాసేపు అలా ఉంచుతారు. చంటిపిల్లలకైతే గోంగూర కర్రలు కాకుండా చెరుకు గడ ముక్కలకు ఒత్తిలు కట్టించి కొట్టిస్తారు.

అలా వరుసగా మూడు లేదా ఐదు సంవత్సరాలు దివిటీలు చెరుకు గడ ముక్కలతోనే దివిటీలు కొట్టిస్తారు. ఆ తరువాత కాస్త పెద్దయ్యాక గోంగూరు కర్రలకు అంటే ఆకులు వలిచేసిన గోంగూర కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిలాంటి బట్టను కట్టి..దాన్ని దీపంతో వెలిగించి..దివిటీలు కొట్టిస్తారు. పిల్లలను వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలు వెలిగించి ఆకాశంలో దక్షిణ వైపు చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. దివిటీలు కొట్టేటప్పుడు ..

“దిబ్బూ దిబ్బూ దీపావళి …
మళ్ళీ వచ్చే నాగుల చవితి….
పుట్ట మీద పొట్ట కర్ర..హూత్ బెల్లంముక్క..
దిబ్బు దిబ్బు దీపావళీ
బలుసు చెట్టు మీద పెద్దలారా దిగిరండి..అంటూ పిల్లలతో పాడిస్తు నేలమీద గోంగూర కర్రలతో కొట్టిస్తారు..

దివిటీలు కొట్టటం పూర్తి అయ్యాక..ఆ తర్వాత ఆ కాడలను ఒక పక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి తుడిచి నోరు శుభ్రం చేయించి మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంట్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు.

Bhagini Hasta Bhojanam : త్రిశూలంతో యమధర్మరాజునే పరుగెత్తించిన పరమశివుడు .. భగినీ హస్త భోజనం వెనుక ఆసక్తికర కథ

దీపావళి రోజు పితృ దేవతల సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ పిల్లల గృహాలను చూడటానికి వస్తారట. వారికి దారి కనిపించడం కోసమే దీపాలు ..దివిటీలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది అని అంటారు. అలాగే దివిటీలు కొట్టే శబ్దానికి పితృదేవతలు తమ వారసుల పిల్లలను గుర్తిస్తారని అంటారు.

మరి గోంగూరు కర్రలనే దివిటీలకు ఎందుకు వినియోగిస్తారు అంటూ..దీపావళి శీతాకాలంలో వస్తుందనే విషయం తెలిసిందే. శీతాకాలంలో చలికి శరీరం చల్లదనానికి గురవుతుంది.దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సమస్యలు శీతాకాలంలో వస్తాయి. శరీరంలో వేడి తగ్గటం వల్ల వచ్చే వ్యాధులకు గోంగూర చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. గోంగూరు తింటే శరీరంలో వేడి పుడుతుంది. కాబట్టి గోంగూరను మొక్కల్ని తెచ్చి వాటి ఆకుల్ని వలిచి గోంగూరు కూరగానీ, పచ్చడి గానీ లేదా వేరే విధాలుగా వండుకుని తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గోంగూర ఆకుల్ని వలిచేసిన కర్రలకు నూనెలో నానబెట్టిన బట్టను వత్తిలాగా కట్టి దాన్ని వెలిగించి పిల్లలతో దివిటీలు కొట్టిస్తారు.

గోంగూర కర్రలు, చెరుకు గడ ముక్కలు, లేదా బొబ్బాస ఆకు కర్రలు, లేదా ఆముదం ఆకు కర్రలు వంటివి కూడా ఉపయోగిస్తారు. కానీ గోంగూరు శీతాకాలంలో తింటే మంచిది కాబట్టి ఎక్కువగా గోంగూరు కర్రలనే ఉపయోగిస్తారు. అలా దీపావళికి కొట్టి దివిటీలలో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. అదే హిందు పండుగల్లో విశిష్టతగా చెప్పుకోవచ్చు..

Diwali 2023 : ధనత్రయోదశి రోజు మృత్యు దోషం తొలగించే ‘యమదీపం’ వెనుక ఆసక్తికర కథ

శీతాకాలం అంటేనే కాలుష్యాల కాలం. ప్రకృతి పరంగా ఈ సీజన్ అటువంటిది. కాలుష్యం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల గాలి ద్వారా, వర్షపు నీటి ద్వారా వచ్చే దోమల కారణంగా క్రిమికీటకాల నుంచి రోగాలు వ్యాపిస్తాయి.  ఈక్రిమికీటకాలను చంపటానికి పూర్వకాలంలో టపాసులు కాల్చేవారట. మతాబులు, చిచ్చుబుడ్లు వంటివాటిలో ఉండే కెమికల్స్ కాల్చటం వల్ల ఆ క్రిములు చనిపోవటానికి వాడేవారట. కానీ ఇప్పుడు క్రిమిలను చంపటానికి ఎన్నో రకాల స్ప్రేలు వచ్చాయి. కానీ పూర్వకాలంలో అటువంటివి లేవు..అందుకే దీపావళి తరువాత దోమలు సమస్య తగ్గేదని దానికి కారణం బాణసంచా కాల్చటమే.

కానీ ఇప్పుడా బాణసంచా కాల్చటం వల్ల క్రిమికీటకాలు చనిపోవటం మాట పక్కన పెడితే విపరీతమైన శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ సమస్యలకు దీపావళి కారణమవుతోందనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.