Bhagini Hasta Bhojanam : త్రిశూలంతో యమధర్మరాజునే పరుగెత్తించిన పరమశివుడు .. భగినీ హస్త భోజనం వెనుక ఆసక్తికర కథ

ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ.

Bhagini Hasta Bhojanam : త్రిశూలంతో యమధర్మరాజునే పరుగెత్తించిన పరమశివుడు .. భగినీ హస్త భోజనం వెనుక ఆసక్తికర కథ

bhagini hastha bhojanam

Diwali 2023..Bhagini Hasta Bhojanam : ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. ఇది అన్నా, చెల్లెళ్ల పండుగ. సాధారణంగా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ. దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే..అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. తన వివాహం అయ్యాక తనను చూడటానికి రాని అన్న..తను ఎంతగా కోరినా తనను చూడటానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ ‘భగినీ హస్త భోజనం’. వేడుకలో ప్రతిబింభిస్తుంది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు.

కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగినీ అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. ఐదు రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీ హస్త భోజనం కూడా ఒకటి. అన్నా లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం. ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికర పురాణ కథ ఉంది.

Diwali 2023 : ధనత్రయోదశి రోజు మృత్యు దోషం తొలగించే ‘యమదీపం’ వెనుక ఆసక్తికర కథ

యమధర్మరాజు చెల్లెలు యమున. తనకు వివాహం అయి అత్తవారింటికి వెళ్లాక తన ఇంటికి అన్న తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయిన యుముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేక చెల్లెలు ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈక్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయటానికి యముడు తన యమపాశంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అసలే భోళా శంకరుడు. భక్తుడు పిలిస్తే కాకుండా ఉండగలడా.. అంతే మార్కండేయుడు ప్రాణాలు తీయటానికి వెళ్లిన యముడ్ని అడ్డగించేందుక తన త్రిశూలాన్ని తీసుకుని వెళతాడు. మార్కండేయుడు తన భక్తుడు. అని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతాడు. కానీ నేను తనకు అందరు సమానమే..అందుకే తనకు సమవర్తి అనే పేరు వచ్చింది..పేదా గొప్పా..భక్తుడా..? నాస్తికుడా అనే తేడా తనకు తెలియదు ఏ భక్తుడైనా తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు..అర్థాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తాను అని స్పష్టం చేస్తాడు.

దీంతో లయ కారకుడ్ని నా మాటనే ఎదిరిస్తావా… అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి..మార్కండేయుడికి మధ్యతో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుడా తనను అడ్డుగా రావటం సరికాదని శివుడిని అంటాడు.దీంతో శివుడికి ఆగ్రహం వ్యక్తం చేస్తు తన త్రిశూలాన్ని యుముడిపై విసరబోతాడు.త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని ధాటి నుంచి తప్పించుకోవటానికి పరుగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యుముడ్ని వెంటాడతా.

శివుడు త్రిశూలంతో వెంటపడటంతో..యముడు అలా పరుగెత్తుకుంటు వెళ్లి అనుకోకుండా తన చెల్లెలి యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో అన్నా ఎన్నాల్టికి నామీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతు శివుడు వెంటరావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలి చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంటుంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెళ్ల బంధాన్ని..అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది..ఇటు ఎన్నాళ్లగానే అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరింది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది.

Diwali 2023 : లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత .. శంఖం ప్రాముఖ్యత

శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణనూ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకొమ్మా..తీరుస్తాను అంటాడు. దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా..ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది. చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడవుతాడు. తథాస్తు అంటాడు.

అలా ప్రతీ ఏటా కార్తీక శుద్ధ విదియనాడు ఇంటికి వచ్చి, ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. ‘నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు, సోదరుడికి ఈరోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది’ అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్తాడు.

అలాగే యమునకు, యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే ‘యమ ద్వితీయ’ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణగాధలు చెబుతున్నాయి. సోదరి చేతి వంట కాబట్టి ‘భగినీ హస్తభోజనం’గా మారింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయం ఉంది.

కాగా..యాంత్రికంగా మారిపోయిన ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిల్లుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. సాధారణంగా హిందు పండుగల్లో ఇటువంటి విశేషాలు దాగుంటాయి. ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. ఇవి కేవలం పండుగలే కాదు బంధాలను..అనుబంధాలను పెంపొందించేవి అని చెప్పుకుని తీరాలి.

కాగా..ఈ భగిని హస్త భోజనం వేడుకను భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం పండుగ. సోదరుని క్షేమం..సోదరీ మణి సౌభాగ్యానికి సంబంధించినదీ పండుగ.