Diwali 2023 : లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత .. శంఖం ప్రాముఖ్యత

దీపావళి రోజున చేసే లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు. దక్షిణావర్తి శంఖం ప్రాముఖ్యత..

Diwali 2023 : లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత .. శంఖం ప్రాముఖ్యత

dakshinavarti shankh pooja in Diwali day

Diwali 2023 Dakshinavarti Shankh: శంఖం. సముద్రం నుంచి లభించే శంఖానికి పురాణాలలో చాలా విశిష్టమైన స్థానం ఉంది. శ్రీకృష్ణుడు, అర్జనుడితో పాటు పంచ పాండవుల  వద్ద ఉండే శంఖాలకు చక్కటి పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. అర్జనుడు శంఖం పేరు దేవదత్తం. భీముడి శంఖం పేరు పౌండ్రకం, ధర్మరాజు శంఖం పేరు అనంత విజయ, నకులుడు శంఖం సుఘోషనామం, సహదేవుడి శంఖం పేరు మణిపుష్ప అనే పేర్లతో పిలుస్తారని మహాభారత కథలు చెబుతున్నాయి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. శంఖ నాధం అని అంటారు. శంఖ నాధం చేసి యుద్ధం ప్రారంభించేవారట.కురుక్షేత్ర యుద్ధంలో శంఖనాధం చాలా ప్రసిద్ధి చెందింది.

అటువంటి శంఖం క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో ఒక్కటి అని పురాణగాధలు చెబుతున్నాయి. హిందూ సంస్కృతిలో ‘శంఖం’నికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీలక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. క్షీరసాగర మధనంలో పాల సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటిగా చెప్పబడుతోంది.

Diwali 2023 : ఐదు రోజుల పండుగ దీపావళి .. ఏ రోజు ఏ విశేషమో తెలుసా..?

లక్ష్మిదేవి ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు కొలువై ఉంటాయి. ఆ ఇంట ఆనందం తాండవిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి సంపదకు అధిదేవతగా భావిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారనే విషయం తెలిసిందే. మరి ఏపూజకైనా తొలి పూజ గణనాధుడితే అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లక్ష్మీదేవి, వినాయకుడి పూజ సమయంలో ‘దక్షిణావర్తి శంఖం’ పూజ చాలా విశిష్టమైనది. దీపావళి రోజున లక్ష్మీ పూజలో ‘దక్షిణావర్తి శంఖం’ పూజ చేస్తే ఆ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతారు. దీపావళి నుంచి ప్రతీ శుక్రవారం ఈ ‘దక్షిణావర్తి శంఖం’పూజను కొనసాగిస్తే ఇక ఆ ఇల్లు సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుందట. ఇంటిలో ధన ధన్యాలకు కొదువే ఉండదట. ఒకరికి పెట్టేవారిగానే ఉంటారట.

క్షీరసాగర మధనంలో దక్షిణావర్తి శంఖం..
అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని మధించారనే పురాణ కథ తెలిసిందే. ఈ కథ ప్రకరాం క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం కూడా పుట్టింది. శ్రీ మహాలక్ష్మీ కూడా పుట్టింది. మహాలక్ష్మితో పాటూ దక్షిణావర్తి శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతందని చెబుతారు. సిరిసంపదలను..సుఖ సంతోషాలను, సకల శుభాలను కలిగించే ‘దక్షిణావర్తి శంఖం’ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదట.

దక్షిణావర్తి శంఖం ప్రత్యేకత ఏంటి..దాన్ని ఎలా గుర్తించాలి..?
సాధారణంగా శంఖాలు సముద్రంలోంచి లభిస్తాయనే విషయం తెలిసిందే. ఇలా సముద్రంలో లభ్యమయ్యే శంఖాలన్నీ ఎడమ రెక్కలవే ఎక్కువగా ఉంటాయి. కానీ దక్షిణ శంఖం చాలా ప్రత్యేకమైనది. దీని ముఖం కుడి వైపు ఉంటుంది. ఈ శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు.

Diwali 2023 : లక్ష్మీపూజలో ఐదు వత్తులు దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం, విశిష్టత

ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతారు. శుభ్రంగా ఉండే ఎర్రటి వస్త్రంలో ఈ శంఖాన్ని పెట్టి గంగాజలంతో నింపాలి. ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అంటూ మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలోను చుట్టి ఉంచాలి. ఓపెన్ గా ఉంచకూడదట. ఈ శంఖాన్ని ప్రతీ శుక్రవారం నియమాలతో పూజిస్తే ఇంట్లో సంపదకు కొదువే ఉండదట.

దీపావళి రోజున దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవటం చాలా చాలా శుభప్రదం. శంఖాన్ని నైరుతి దిశలో ఉంచాలి. పూజ పూర్తి అయ్యాక ఓం శ్రీ లక్ష్మీ సహోద్రాయ నమః అంటూ 108 సార్లు జపించి లక్ష్మీపూజ తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచుకోవాలి. దక్షిణావర్తి శంఖాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి చొరబడవు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. శత్రుపీడ తొలగిపోతుంది. ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసముంటుందని నమ్ముతారు.

Diwali 2023 : దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఒక్కో పేరుకు ఒకో అర్థం

కాగా..క్షీర సాగర మధనంలో పాలసముద్రం నుండి కామధేనువు పుట్టగా దానిని దేవ మునులు తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవం అనే గుఱ్ఱం పుట్టగా దానిని బలి చక్రవర్తి తీసుకున్నాడు. తరువాత “ఐరావతం” అనే ఏనుగు, కల్పవృక్షం పుట్టగా వాటిని స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత రంభ,ఊర్వసి, మేనక,ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుగోష అనే అప్సరసలు, చంద్రుడు, సంపదల తల్లి లక్ష్మీదేవి అవతరించింది. కౌస్తుభం అనే అమూల్యమైన మాణిక్యం పుట్టాయి.

అలాగే ధన్వంతరి,కాలకూటం విషం అయిన హాలాహలం కూడా ఈ పాల సముద్రం నుంచే పుట్టింది. హాలాహలాన్ని శివుడు మింగి అది కడుపులోకి వెళ్లకుండా కంఠంలోనే నిలిపివేశాడు. దీంతో గరళకంఠుడిగా పేరొందాడు శివుడు.