Diwali 2023 : లక్ష్మీపూజలో ఐదు వత్తులు దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం, విశిష్టత

దీపావళి పండుగలో లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంది. లక్ష్మీదేవికి చేసే దీపారాధన కుందిలో వేసే వత్తులు కూడా ప్రధానమైనవి.. ఈ దీపపు కుందిలో ఐదు వత్తుల అర్థమేంటో తెలుసా..?

Diwali 2023 : లక్ష్మీపూజలో ఐదు వత్తులు దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం, విశిష్టత

diwali lakshmi pooja

Diwali 2023.. Lakshmi devi pooja : దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపం. అంతేకాదు దీపంలో సకల దేవతలు,వేదాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. చీకట్లో చిరుదీపం అంటారు. దీపంలో కాంతి ఒక్కటే కాదు శాంతి కూడా ఉంది. దీపాన్ని చూస్తే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. దీపావళి పండుగలో ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన కుందిలో వేసే వత్తులు కూడా ప్రధానమైనవే. ఈ దీపపు కుందిలో ఐదు వత్తులు వేసి ఇంటి ఇల్లాలు వెలిగించాలి. గృహిణి స్వయంగా ఐదు వత్తులు వెలిగించాలి.

ఈ ఐదు వత్తుల్లో చక్కటి అర్థం ఉంది. కుటుంబ క్షేమం ఉంది. ఇంటి సౌభాగ్యం ఉంది. ఈ ఐదు వత్తుల్లో మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసం, రెండో వత్తి అత్త మామల క్షేమం కోసం, మూడవ వత్తి తోడబుట్టిన క్షేమం కోసం, నాలుగ వత్తి ఇంటి గౌరవం, ఐశ్వర్యం, ధర్మం కోసం, ఐదవది వత్తి వంశాభివృద్ధి కోసం వెలిగిస్తారు. ఇలా ఐదు వత్తులు వెలిగిస్తే సిరి సంపదలతో పాటు కుటుంబ క్షేమం ధనాభివృద్ధి కలుగుతుంది.

Diwali 2023 : దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఒక్కో పేరుకు ఒకో అర్థం

దీపారాధన ఎవరు చేసినా కనీసం రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఒక్క వత్తితో దీపం వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. రెండు అంటే జంట. భార్యా భర్తల్ని జంట అంటారు. అలాగే హిందు పురాణాల్లో జంటకు చాలా ప్రాముఖ్యత ఉంది.

దీపారధన నూనె.. ఏది శ్రేష్టం..?..
ఆవునెయ్యి : సాధారణంగా దీపాలను వెలిగించే నూనె విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది..? అనే అనుమానాలు వస్తుంటాయి. కొంతమంది కొబ్బరి నూనె. మరి కొంతమంది నువ్వుల నూనె మంచిదని అంటుంటారు. కానీ అన్నింటికంటే శ్రేష్టమైనది ఆవునేతితో వెలిగించే దీపం. అది అందుబాటులో లేకపోతే మరేదైనా నూనె ఉపయోగించుకోవచ్చు. కానీ ఆవునేతితో దీపం వెలిగించటం చాలా చాలా మంచిది. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే మరింత మంచి జరుగుతుంది. కొద్దిగా వేప నూనె తీసుకుని ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయాలు సిద్ధిస్తాయని..ఏ పని చేసినా చక్కటి ఫలితం లభిస్తుంది.

అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. ఇది సంప్రదాయ పరంగానే కాక శాస్త్ర పరంగా కూడా చాలా మంచిది. అలాగే అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా ఇష్టం. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యా భర్తలూ అనోన్యంగా జీవిస్తారనీ..వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని అంటారు. ముఖ్యంగా నువ్వుల నూనె దీపారాధన అంటే సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇస్తుందట.

Diwali 2023 : దీపావళి ముహూర్తం .. పండితులు ఏం చెబుతున్నారంటే..?

శివపార్వతులు అంటే అన్యోన్యానికి ప్రతీక. వారిని దీపారాధనతో కొలిస్తే చాలా మంచి జరుగుతుంది. ఒక పార్వతీ నందుడైన వినాయకుడి పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే చాలా మంచిది. అలాగే వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదని వేద పండితులు చెబుతున్నారు. కానీ వాడే నూనె ఏదైనా భక్తి మాత్రం ప్రధానమైనదని మర్చిపోకూడదు.