Diwali 2023 : ధనత్రయోదశి రోజు మృత్యు దోషం తొలగించే ‘యమదీపం’ వెనుక ఆసక్తికర కథ

ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వైద్యుడు ఎవరు అంటే.. ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు.

Diwali 2023 : ధనత్రయోదశి రోజు మృత్యు దోషం తొలగించే ‘యమదీపం’ వెనుక ఆసక్తికర కథ

Diwali Yama deepam

Diwali 2023 Yama deepam : ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వైద్యుడు ఎవరు అంటూ ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్నాడు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడుగా చెబుతున్నారు.

ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ధనత్రయోదశితోనే మొదలయ్యే దీపావళి పండుగ రోజు ‘యమదీపం’ చాలా చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఈ యమదీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు రావని..ఒకవేళ అటువంటివి ఉంటే అవి తొలగిపోతాయని అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. ఈ యమదీపం వెనుక అత్యంత ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త చనిపోతాడని తెలిసి కూడా వివాహం చేసుకున్న ఓ రాకుమారి ఆసక్తికర కథ ఉంది. తన భర్తను కాపాడుకుంటాననే ఓ నమ్మకం ఉంది.

Diwali 2023 : లక్ష్మీపూజలో సకల శుభాలు కలిగించే దక్షిణావర్తి శంఖం పూజ విశిష్టత .. శంఖం ప్రాముఖ్యత

పురాణాలు కథల రూపంలోనే అత్యంత ఆసక్తికరంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అటువంటి ఓ ఆసక్తిక కథే ఈ యమదీపం వెనుక ఉంది. పూర్వం హిమ అనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుట్టాడట. అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజునే చనిపోతాడని చెప్పారట. ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు. కుమారుడు దక్కితే చాలు అనుకుని అసలు పెళ్లే చేయకూడని నిర్ణయించుకున్నాడు. అలా రాకుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయస్సుకొచ్చాడు.

కానీ కొడుకుకు వివాహం చేయాలనే తలంపే రాజుకు రాలేదు. కారణం కొడుకు చనిపోతాడనే భయం. దాంతో వివాహం మాటే తలచేవాడు కాదు. కానీ విధి అనేది ఒకటుంటుంది.దాన్ని ఎవరు తప్పించలేరు. ఈ క్రమంలో రాజకుమారుడ్ని ఓ రాకూమారి వలచింది. అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ హిమ రాజు మాత్రం తన కుమారుడి వివాహానికి అంగీకరించలేదు. వివాహం జరిగితే నీకు వైధవ్యం ప్రాప్తిస్తుంది నా కుమారుడితో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచించాడు.

కానీ తన నిర్ణయానికి తిరుగులేదని..తన సౌభాగ్యాన్ని కాపాడుకోవటమే కాదు మీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్పింది. దానికి హిమ విధిని తప్పించలేం..జరగాల్సింది జరుగుతుందని నిశ్చయించుకుని వివాహానికి అంగీకరించాడు.కానీ సదరు రాకుమారిని అందరు హెచ్చరించారు. కోరి కోరి వైధవ్యాన్ని తెచ్చుకుంటావా..? అర్థ ఆయుష్కుడిని పెళ్లి చేసుకుంటావా..? అంటూ భయపెట్టారు..హెచ్చరించారు.

Diwali 2023 : ఐదు రోజుల పండుగ దీపావళి .. ఏ రోజు ఏ విశేషమో తెలుసా..?

కానీ ఆమె అంగీకరించలేదు. కానీ తాను వరించినవ్యక్తినే పెళ్లిచేసుకుంటానని..తన భర్తని తానే కాపాడుకుంటానని నమ్మకంగా చెబుతుంది. అలా పెళ్లి జరిగిపోతుంది. నాలుగో రోజు రానే వచ్చింది. అదే రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యువు కబళించవచ్చు. ఆ విషయం ముందే తెలిసిన రాకుమారి రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలను రాశులుగా పోసింది..దీపాలు వెలిగించింది. రాజప్రాసాదం అంతా దీపాలు, బంగారు వెలుగు జిలుగులతో వెలిగిపోతోంది. అంతేకాదు సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని స్తుతిస్తూ పాటలు పాడుతుంటుంది.

అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు హరించేదుకు యముడు పాము రూపంలో రాజమహల్ కు వచ్చాడు. కానీ ఓ పక్క దీపాల వెలుగులు, మరో పక్క ధగధగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంతి వల్ల యముడి కళ్లు జిగేలుమన్నాయి. కళ్లు చెదిరాయి. యువరాణి పాటలకు మైమరచిపోయాడు. కానీ అప్పటికే మృత్యు ఘడియలు దాటిపోయాయి. దీంతో సమవర్తి అయిన యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్లిపోయాడు. అలా నాలుగో రోజు రాకుమారుడు మృత్యపీడ తొలగిపోయింది.

Diwali 2023 : లక్ష్మీపూజలో ఐదు వత్తులు దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం, విశిష్టత

అప్పటి నుంచీ ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం…ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెబుతారు. అలా చేయటం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని అంటారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ధన్వంతరిని వైద్యో నారాయణ హరి అని అంటారు. ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా భావిస్తారు. ఆరోగ్యాలనిచ్చే ధన్వంతరికి భారతదేశంలో దేవాలయాలు కూడా ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.