High Salary Courses : ఇంటర్ తరువాత ఈ కోర్సులు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు తెలుసా !

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.

High Salary Courses : ఇంటర్ తరువాత ఈ కోర్సులు చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు తెలుసా !

courses after inter

High Salary Courses : ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ తరువాత ఏం చదవాలన్నది ఎంతో కీలకమైనది. భవిష్యత్ ప్రణాళిక అన్నది ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాతనే మొదలవుతుంది. అయితే ఈ సమయంలోనే పకడ్బందీగా , పటిష్టమైన కెరీర్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్ తర్వాత ఏ కోర్సుల్లో చేరటం మంచిది? మనం ఫ్యూచర్ లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి? అందుకు తగ్గట్టుగా ఏ కోర్సు చేస్తే బాగుంటుంది? ఇలా అనేక సందేహాలు కలుగుతుంటాయి.

READ ALSO : Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్ధులు ఇంటర్ తరువాత తల్లిదండ్రుల ప్రోద్భలంతోనో, తెలిసిన వారు చెప్పారనో మెడికల్, ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటారు. దీంతో ఆయా కోర్సులకు ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతుంది. కొంత మందికి ఆకోర్సుల్లో సీట్లు లభించక నిరుత్యాహానికి గురవుతుంటారు. అలాంటి వారికి కొన్ని రకాల కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని విద్యా, ఉపాధి రంగాల్లోని నిపుణులు చెబుతున్నారు. వీటిలో చేరటం ద్వారా నైపుణ్యం పెంచుకోగలిగితే త్వరగా కెరీర్ లో స్ధిరపడటంతోపాటు, లక్షలాది రూపాయల వేతనాలను అందుకోవచ్చు. అలాంటి కోర్సుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

ఫ్యాషన్ డిజైనింగ్  ;

నైపుణ్యం ఉంటే ఏరంగంలోనైనా రాణించటం పెద్ద కష్టమేమి కాదు. డిజైన్ రంగం పరిధి చాలా పెద్దది. డిజైనింగ్ అంటే ఒక్క ఫ్యాషన్ డిజైన్‌ మాత్రమే కాదు ఫుట్‌వేర్, టెక్స్‌టైల్, లెదర్, బ్యాగ్ ఇండస్ట్రీ, వంటివాటిలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఫ్యాషన్ పరిశ్రమకు జనాదరణ రోజురోజుకు పెరుగుతుంది. నైపుణ్యం కలిగిన ఫ్యాషన్ డిజైనర్లకు అధిక డిమాండ్ ఉంది. క్రియేటివిటీ ఉంటే ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవటం పెద్ద కష్టమేమికాదు. క్రియేటివ్ మీడియా కోర్సు చేయడం ద్వారా నైపుణ్యానికి పదును పెట్టి, సరికొత్త డిజైన్‌లను ఆవిష్కరించవచ్చు. ప్రతిభ ఉన్నవారికి పెద్ద పెద్ద సంస్ధల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లేదంటే మీరే సొంతంగా సంస్ధలను స్ధాపించవచ్చు. లక్షలాది రూపాయల వేతనాలను పొందటమే కాకుండా మీరే సొంతంగా సంస్ధలను స్ధాపించి ఇతరులకు ఉపాధి చూపటంతోపాటు, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

గేమ్ డిజైనింగ్ ;

ప్రస్తుతం గేమ్ డిజైన్ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో కొత్తకొత్త మార్పులు వస్తుండటంతో ఆరంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవారి అభిరుచికి తగ్గట్టు గేమింగ్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్, టాబ్లెట్స్ వంటి వాటిల్లో గేమ్స్ ఆడేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతుంది. దీంతో గేమ్ డిజైనర్‌లకు బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో గేమ్ డిజైన్ కోర్సులు ఆన్‌లైన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇంటర్ తరువాత గేమ్ డిజైనింగ్ కోర్సు చేయడం ద్వారా మంచి కెరీర్‌ ఎంచుకున్నవారవుతారు. అనేక ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఆన్‌లైన్ ప్రొఫెషనల్ గేమ్ డిజైనింగ్ కోర్సులను అందుబాటులో ఉంచాయి. ఈ కోర్సులను పూర్తిచేసి నైపుణ్యం సంపాదిస్తే గేమ్ డిజైనర్‌గా పెద్ద కంపెనీల్లో ఉద్యోగంతోపాటు లక్షలాది రూపాయల వేతనం అందుకోవచ్చు.

READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

గ్రాఫిక్ డిజైనింగ్ ;

గ్రాఫిక్ డిజైనర్ అనేది ప్రొడక్ట్స్ , ప్రింట్, అడ్వర్టైజింగ్, వెబ్‌సైట్, మ్యాగజైన్‌లు, బ్రాండ్ ఐడెంటిటీ, గేమ్‌లు మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాల కోసం కంటెంట్‌లను రూపొందించటం. ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయటంలో గ్రాఫిక్ డిజైనర్ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ప్రస్తుతం గ్రాఫిక్ డిజైన్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగ నిపుణులకు డిమాండ్ బాగా ఉంది.. గ్రాఫిక్,వెబ్ డిజైనింగ్ కోర్సులను అభ్యసించడం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకొని అనేక వ్యాపార సంస్ధలకు, కంపెనీలకు ఆకట్టుకునే డిజైన్‌లు గ్రాఫిక్స్ తో వెబ్ సైట్స్, కేటలాగ్స్ చేయవచ్చు. ఈ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పని అనుభం, మనం ప్రదర్శించే నైపుణ్యంతో లక్షలాది రూపాయలను వేతనంగా పొందవచ్చు.