IIT Govt Jobs : గోల్డెన్ ఛాన్స్.. IIT రోపర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైనే జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
IIT Ropar Faculty Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఐఐటీ రోపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు ఈ నెల 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

IIT Ropar Faculty Recruitment 2025
IIT Ropar Faculty Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. ఐఐటీ రోపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఉన్నత విద్యా రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఐఐటీ రోపర్ అధికారిక వెబ్‌సైట్ (iitrpr.ac.in)లో కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీని మార్చి 30, 2025గా నిర్ణయించారు. రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే?
అర్హత ప్రమాణాలివే :
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్‌డీ డిగ్రీతో పాటు మంచి ఎడ్యుకేషన్ రికార్డు కలిగి ఉండాలి. బీ.టెక్, సీఎస్ఇ, ఇఇ, ఇసిఇ, మ్యాథ్, కంప్యూటింగ్, బి.ఎస్సి, ఎం.ఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఎఐ-ఎంఎల్, డేటా సైన్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారులకు కనీసం 3 ఏళ్ల టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
గ్రేడ్-II కోసం దరఖాస్తు ప్రక్రియ :
పీహెచ్‌డీ తర్వాత అభ్యర్థికి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా వృత్తిని ప్రారంభించే రీసెర్చర్లు, విద్యావేత్తలకు ఈ పోస్టు ఒక అద్భుతమైన అవకాశం. దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు :
ఈ నియామకానికి ఇమెయిల్ లేదా హార్డ్ కాపీ ద్వారా వచ్చే దరఖాస్తులు అంగీకరించమని ఐఐటీ రోపర్ స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో బీ.టెక్, ఎం.ఎస్సీ, పీహెచ్‌డీ మొదలైన మార్కుల షీట్, డిగ్రీ పీడీఎఫ్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ :
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెమినార్ హాజరు, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఈ నియామకానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ఐఐటీ రోపర్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.
జీతం ఎంతంటే? :
ఐఐటీ రోపర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400 (లెవల్-12) వరకు జీతం వస్తుంది. అదే సమయంలో, గ్రేడ్-II అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు లెవల్-10 ప్రకారం.. రూ. 57,700 నుంచి రూ. 98,200 వరకు జీతం అందుతుంది. ప్రారంభ జీతం రూ. 70,900 నుంచి ఉంటుంది.
అంతేకాదు.. ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా జీతం కూడా పెరుగుదల ఉంటుంది. ఒక ఏడాది అనుభవం తర్వాత జీతం రూ. 84,800, 2 ఏళ్ల తర్వాత రూ. 87,300కి పెరుగుతుంది. జీతంతో పాటు, అభ్యర్థులకు వైద్య సౌకర్యం, ట్రాన్స్‌ఫర్ ఖర్చులు, టెలిఫోన్ బిల్లు, వృత్తిపరమైన భత్యం, గృహ సౌకర్యం వంటి భత్యాలు కూడా అందుతాయి.