IIT Kharagpur Placements : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

IIT Kharagpur Placements : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ

Indian Institute of Technology Teaching Vacancies

Updated On : January 12, 2023 / 5:41 PM IST

IIT Kharagpur Placements : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఆర్కిటెక్చర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో ఈ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తుల స్వీకరణకు 28 ఫిబ్రవరి 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://erp.iitkgp.ac.in/ పరిశీలించగలరు.