ఇండియన్ నేవీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 09:57 AM IST
ఇండియన్ నేవీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ఇండియన్ నేవీ సెయిలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెయిలర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు నిర్వహించనున్న రాతపరీక్షల  హాల్‌టికెట్లను విడుదల చేసింది.  అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమవ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 2019 ఆగస్టు బ్యాచ్ కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు మెట్రిక్ రిక్రూట్, సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఆర్టిఫిజర్ అప్రెంటిసెస్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగంలోనూ అర్హత మార్కులు సాధించాల్సిందే. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానాకి 0.25 మార్కు కోత విధిస్తారు.