అన్‌మ్యారీడ్ మెన్స్‌కు మాత్రమే : నేవీ ఉద్యోగాలు
డిఫరెంట్ జాబ్ చేయాలని అనుకునేవారికి, దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇండియన్ నేవీ వెల్‌కమ్ చెబుతోంది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

డిఫరెంట్ జాబ్ చేయాలని అనుకునేవారికి, దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇండియన్ నేవీ వెల్‌కమ్ చెబుతోంది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
డిఫరెంట్ జాబ్ చేయాలని అనుకునేవారికి, దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇండియన్ నేవీ వెల్‌కమ్ చెబుతోంది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్/ టెక్నికల్ బ్రాంచ్‌లో పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్, షార్ట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అన్‌మ్యారీడ్ మెన్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 2019, జనవరి 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమల నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
* కమిషన్ ఆఫీసర్లు (పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్, షార్ట్ కమిషన్)
* పోస్టుల సంఖ్య: 102
* దరఖాస్తుకు చివరి తేదీ 2019, ఫిబ్రవరి 1
* అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు
బ్రాంచ్/ కేడర్ వారీగా ఖాళీలు..
* ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ -12
* నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ కేడర్ – 27
* జనరల్ సర్వీస్ – 03
* హైడ్రోగ్రఫీ సర్వీస్ కేడర్
టెక్నికల్ బ్రాంచ్..
ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) – 28
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) – 32
క్వాలిఫికేషన్: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు