Inter Result 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటినుంచి? ఫీజు ఎక్కడ చెల్లించాలి?

ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు.

Inter Result 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటినుంచి? ఫీజు ఎక్కడ చెల్లించాలి?

Updated On : April 22, 2025 / 1:28 PM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల వేళ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాలకు విద్యార్థులు మొత్తం 9 లక్షల 97 వేల 12 మంది హాజరయ్యారని అన్నారు.

మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 66.89 గా, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్  71.37గా ఉంది. మొదటి సంవత్సరం బాలికలు పాస్ పర్సంటేజ్  73.83, బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.83గా ఉంది. సెకండ్ ఇయర్ బాలికలు పాస్ పర్సంటేజ్ 74.21, సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్  57.21గా నమోదైంది.

సప్లిమెంటరీ పరీక్షలకు కాలేజీల్లో ఫీజు చెల్లించాలి..
ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చు. తెలంగాణ ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఈ ఏడాది మేలో నిర్వహిస్తారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు రెండు సెషన్లలో మే 22 నుంచి జరుగుతాయి. అలాగే, ప్రాక్టికల్ పరీక్షలు జూన్‌ 3 నుంచి జూన్‌ 6 వరకు ఉంటాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 23 నుంచి 30 వరకు వారి కాలేజీల్లో చెల్లించవచ్చు.