JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ విడుదల… ఇలా చెక్‌ చేసుకోండి…

అధికారిక వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in కి వెళ్లండి

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ విడుదల… ఇలా చెక్‌ చేసుకోండి…

Updated On : June 2, 2025 / 12:05 PM IST

ఐఐటీల్లో బీటెక్‌తో పాటు బీఎస్‌, ఇంటిగ్రేటెడ్‌ కోర్సు (ఐదేళ్ల కోర్సు)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ ఇవాళ విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ను మే 18న నిర్వహించారు. https://results25.jeeadv.ac.in/ లో స్టూడెంట్‌ ఫలితాలు చూసుకోవచ్చు. స్టూడెంట్ల మార్కులతో పాటు కేటగిరీ ర్యాంక్‌ కూడా ఇచ్చారు.

పరీక్ష వివరాలు

  • దేశవ్యాప్తంగా సుమారు 1.80 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి సుమారు 40,000 మంది పరీక్షకు హాజరైనట్లు అంచనా.
  • గత ఏడాది రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా 48,248 మంది విద్యార్థులు జోసా కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.
  • గత ఏడాది ఐఐటీ సీట్లు మొత్తం 23 ఐఐటీల్లో కలిపి 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఐఐటీ మద్రాస్‌ సహా కొన్ని ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
  • జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జోసా-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Also Read: మహిళా సంఘాల కోసం కొత్త స్కీమ్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రకటించిన సీఎం రేవంత్.. ఈ స్కీమ్ లాభాలివే..

రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

  • అధికారిక వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in కి వెళ్లండి
  • జేఈఈ ఫలితాలు ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి
  • రోల్‌నంబర్: మీ 9 అంకెల జేఈఈ అడ్వాన్స్‌డ్ రోల్ నంబర్ ఇవ్వండి
  • డీవోబీ: మీ పుట్టిన తేది DD/MM/YYYY ఫార్మాట్‌లో నమోదు చేయండి
  • మీ 10 అంకెల మొబైల్ నంబర్ ఇవ్వండి.
  • “Get Result” బటన్‌పై క్లిక్ చేయండి
  • మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి