JEE Main 2024 Paper 2 Result : అతి త్వరలో జేఈఈ మెయిన్ 2024 పేపర్ 2 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!

JEE Main 2024 Paper 2 Result : జేఈఈ మెయిన్ 2024 ఫలితాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి. స్కోర్‌కార్డ్‌లను యాక్సెస్ చేయడానికి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు.

JEE Main 2024 Paper 2 Result : అతి త్వరలో జేఈఈ మెయిన్ 2024 పేపర్ 2 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!

JEE Main 2024 Paper 2 January Session Result To Be Announced

JEE Main 2024 Paper 2 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 పేపర్ 2 ఫలితాలను ప్రకటించనుంది. జనవరి 24న జేఈఈ మెయిన్ 2024 సెషన్ పరీక్షకు హాజరైన (BArch/BPlanning) అభ్యర్థులు తమ ఫలితాలను విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

స్కోర్‌కార్డులను యాక్సెస్ చేయడానికి జేఈఈ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఫలితంగా బీఆర్చ్, బీప్లానింగ్ పేపర్‌లలో సాధించిన స్కోర్‌లను పొందవచ్చు. అందిన సమాచారం మేరకు జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష ఫలితాలు ఈ నెల 28న వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Read Also : AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

జేఈఈ మెయిన్ 2024 పేపర్ 2 ఫలితాలు డౌన్‌లోడ్ :
అధికారిక జేఈఈ మెయిన్ 2024 వెబ్‌సైట్‌ (jeemain.nta.ac.in)కి వెళ్లండి.
హోమ్‌పేజీలో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాల లింక్‌ను ఎంచుకోండి.
మీ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయండి.
స్కోర్‌కార్డ్‌లను యాక్సెస్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేయండి.

ఏప్రిల్ 4 నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష :
ఈసారి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జనవరి సెషన్‌ పరీక్షలు నిర్వహించగా.. బీఆర్చ్‌, బీప్లానింగ్‌ పరీక్షలను జనవరి 24న నిర్వహించారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 (ఏప్రిల్ సెషన్) ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం కాగా.. మార్చి 2, 2024న ముగుస్తుంది. ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫారమ్‌లకు అనుమతి ఉండదని గమనించాలి.

ఫలితాల ప్రకటన తర్వాత BArch, BPlanning ప్రోగ్రామ్‌లను అందించే సంస్థలు పర్సంటైల్ స్కోర్‌ల ఆధారంగా అడ్మిషన్ కట్-ఆఫ్‌లను నిర్ణయిస్తాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినఅభ్యర్థులు రిజిస్టర్ కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. సంబంధిత సమాచారంపై అప్‌డేట్స్ పొందడానికి అభ్యర్థులు అధికారిక NTA JEE మెయిన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తుండాలి.

Read Also : AP TET 2024 Exams : ఫిబ్రవరి 27 నుంచే ఏపీ టెట్ పరీక్షలు.. పరీక్ష సమయం, తేదీలివే..!