JEE Main Paper 2 Results : జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
JEE Main Paper 2 Results : (JEE) మెయిన్స్ 2024 పేపర్ 2 ఫలితాలను ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

JEE Main Paper 2 Results Out, Check Steps To Download
JEE Main Paper 2 Results : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 పేపర్ 2 ఫలితాలను ప్రకటించింది. జనవరి 24న జేఈఈ మెయిన్ 2024 బీఆర్చ్/బీప్లానింగ్ పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. స్కోర్‌కార్డులను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బీఆర్చ్, బీప్లానింగ్ పేపర్‌లలో సాధించిన స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు.
Read Also : Kerala AI Teacher Robot : కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..!
జేఈఈ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు :
- ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ (https://jeemain.nta.ac.in/)ను విజిట్ చేయండి.
- పేపర్ 2 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- మీ రిజల్ట్స్ చెక్ చేయండి.
- ఆపై స్కోరుబోర్డు డౌన్‌లోడ్ చేయండి.
బీఆర్చ్, బీప్లానింగ్ ప్రోగ్రామ్‌లను అందించే సంస్థలు ఇప్పుడు పర్సంటైల్ స్కోర్‌ల ఆధారంగా అడ్మిషన్ కట్-ఆఫ్‌లను నిర్ణయిస్తాయి. అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. పేపర్-1కి అర్హత సాధించిన అభ్యర్థులు నిట్, ఐఐటీ ఇతర సిఎఫ్‌టీఐలలో బీఈ/బీటెక్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లకు అర్హులు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు, యూనివర్శిటీల్లో జేఈఈ (మెయిన్)లో విజయవంతమైన అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశానికి జేఈఈ (అడ్వాన్స్‌డ్) ప్రవేశ పరీక్ష కూడా అర్హత సాధిస్తారు. జేఈఈ (మెయిన్) పేపర్ 2 దేశంలోని వివిధ యూనివర్శిటీల్లో బీఆర్చ్, బీప్లానింగ్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం రూపొందించారు.