Job Mela: నిరుద్యోగుల కోసం జాబ్ మేళా.. 7 నుంచి బీటెక్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. రూ.3 లక్షల జీతం.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లాలోని కడప ట్రియో విజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగనుంది.
Trio Vision Composite Technologies Private Limited Job fair
చదువు కంప్లీట్ చేసి సరైన ఉద్యోగం కోసం ఎదుచూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లాలోని కడప ట్రియో విజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగనుంది. జూలై 11న జరుగనున్న ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 76 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగనుంది. కాబట్టి ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పకుండ రిజ్యూమే, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, ఐడీ ప్రూఫ్ తీసుకోని రావాల్సి ఉంటుంది. ఇంకా ఏవైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నుంబర్ 9182335843 ను సంప్రదించగలరు.
విద్యార్హత: 7వ తరగతి నుండి బీటెక్ వరకు ఉత్తీర్ణత సాధించిన ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఉద్యోగ వివరాలు:
ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ వర్కర్ (టెక్నీషియన్‌లు):
ఖాళీలు: 30, అర్హత: ఇంటర్/డిగ్రీ/SSC, వయసు: కనీసం 18 ఏళ్ళు ఉండాలి, జీతం: నెలకు రూ.12,000
ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్ (వెల్డర్) ఖాళీలు 10:
అర్హత: 7వ తరగతి నుండి ఏదైనా, వయసు: కనీసం 18 ఏళ్ళు ఉండాలి, జీతం: ఏడాదికి రూ.2,00,000
యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ ఖాళీలు 10:
అర్హత: డిప్లొమా / B.Tech (కనీసం 2 ఏళ్లు అనుభవం), వయసు: కనీసం 22 ఏళ్ళు ఉండాలి, జీతం: ఏడాదికి రూ.2,64,000
ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్(GET-మెకానికల్ V2) ఖాళీలు 5:
అర్హత: డిప్లొమా / B.Tech (EEE/Mech), వయసు: కనీసం 20 ఏళ్ళు ఉండాలి, జీతం: ఏడాదికి రూ.2,40,000 నుంచి రూ.2,88,000 వరకు ఉంటుంది.
మల్టీ స్కిల్ టెక్నీషియన్ (ప్రొడక్ట్ ఇంజినీర్ / QMS / క్వాలిటీ / CNC ప్రోగ్రామర్) ఖలీలు 21:
అర్హత: డిప్లొమా / B.Tech (EEE / Mech), వయసు: కనీసం 18 ఏళ్ళు ఉండాలి, జీతం: ఏడాదికి రూ.2,20,000 నుంచి రూ.3,60,000 వరకు ఉంటుంది.
