Job Notification : డిగ్రీ కంప్లీటైన వారికి భారీ శుభవార్త.. రూ.41వేలకుపైగా జీతం.. 180 పోస్టులు.. దరఖాస్తుకు కొద్దిరోజులే సమయం..
Job Notification : డిగ్రీ పూర్తయిందా..? మంచి ఉద్యోగం కోసం ఎదరు చూస్తున్నారా.. అయితే, అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త.
Job Notification
- ఏదైనా డిగ్రీ పూర్తయిన వారికి శుభవార్త
- ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
- ఏప్రిల్ 16 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం
Job Notification : డిగ్రీ పూర్తయిందా..? మంచి ఉద్యోగం కోసం ఎదరు చూస్తున్నారా.. అయితే, అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త. ముంబయిలోని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఖాళీగా ఉన్న 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతుంది. అభ్యర్థులు తమకు ఇష్టమైన ఏదైన ఒక నగరంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్, ఫైనాన్స్ విభాగాల్లో జాబ్ కోసం చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం.
Also Read : Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. కుప్పకూలిన ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
పోస్టు వివరాలు :
జూనియర్ అసిస్టెంట్: 180 పోస్టులు
విద్యార్హత :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయస్సు :
2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 1996 ఏప్రిల్ 2 కంటే ముందు, 2005 ఏప్రిల్ 1 తరువాత జన్మించిన వారు అర్హులు కారు.
వేతనం :
నెలకు రూ.38,709 నుంచి రూ. 41,509 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 16, చివరి తేదీ ఏప్రిల్ 30. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 800 ప్లస్ జీఎస్టీ
ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్ష జూన్ మొదటి వారంలో ఉంటుంది.
పూర్తి వివరాల కోసం .. https://studybizz.com/jobs/lic-hfl-junior-assistant-recruitment-2026 ఈ లింక్ లో చూడొచ్చు.
