Job Replacement : బీఎన్ పీలో ఉద్యోగాల భర్తీ

జూనియ‌ర్ టెక్నిషియ‌న్ ప్రింట్‌ పోస్టుకు సంబంధించి 19ఖాళీలు ఉన్నాయి. దీని విద్యార్హతల విషయానికి సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్‌, లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, లెట‌ర్ ప్రెస్ మిష‌న్ మైండ‌ర్‌, ఆఫ్‌సెట్ ప్రింటింగ్‌, ప్లేట్ మేకింగ్, ఎల‌క్ట్రో ప్లేటింగ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.

Job Replacement : బీఎన్ పీలో ఉద్యోగాల భర్తీ

Bnp

Updated On : February 27, 2022 / 4:50 PM IST

Job Replacement : భార‌త ప్ర‌భుత్వానికి చెందిన మినీర‌త్న కంపెనీ మ‌ధ్య ప్ర‌దేశ్ దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 81 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

పోస్టుల వివరాలను పరిశీలిస్తే జూనియ‌ర్ టెక్నిషియ‌న్ ఇంక్ ఫ్యాక్టరీ లో 60 ఖాళీలు భర్తీ చేయనున్నారు. దీని అర్హతల విషయానికి వస్తే పెయింట్ టెక్నాల‌జీలో, డైస్ట‌ఫ్ టెక్నాల‌జీ, స‌ర్ఫేస్ కోటింగ్ టెక్నాల‌జీ, ప్రింట్ ఇంక్ టెక్నాల‌జీ, ప‌్రింటింగ్ టెక్నాల‌జీలో ఫుల్ టైం ఐటీఐ చేసి ఉండాలి. నేష‌న‌ల్ అప్రెంటీష్ షిప్ స‌ర్టిఫికేట్ పొందిన వారు అర్హలు.

జూనియ‌ర్ టెక్నిషియ‌న్ ప్రింట్‌ పోస్టుకు సంబంధించి 19ఖాళీలు ఉన్నాయి. దీని విద్యార్హతల విషయానికి సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్‌, లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, లెట‌ర్ ప్రెస్ మిష‌న్ మైండ‌ర్‌, ఆఫ్‌సెట్ ప్రింటింగ్‌, ప్లేట్ మేకింగ్, ఎల‌క్ట్రో ప్లేటింగ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. నేష‌న‌ల్ అప్రెంటీష్ షిప్ స‌ర్టిఫికేట్ పొంది ఉండాలి.

జూనియ‌ర్ టెక్నిషియ‌న్ ఎల‌క్ట్రిక్‌,ఐటీ పోస్టుకు సబంధించి 2ఖాళీలు ఉన్నాయి. ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ లో ఐటీఐ చేసి ఉండాలి. నేష‌న‌ల్ అప్రెంటీష్ షిప్ స‌ర్టిఫికేట్ పొందిన వారు అర్హులు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా 600 రూ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేది మార్చి 28, 2022గా నిర్ణయించారు.