Job Replacement : గాంధీ మెడికల్ కాలేజ్,హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 52,000రూ నుండి 1,25,000రూ వరకు వేతనంగా చెల్లిస్తారు.

Job Replacement : గాంధీ మెడికల్ కాలేజ్,హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ

Gandhi Hospital Jobs

Updated On : March 21, 2022 / 10:31 AM IST

Job Replacement : తెలంగాణా ప్రభుత్వ అధ్వర్యంలో ఉన్న సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ, గాంధీ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ 115, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 20 ఖాళీలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 52,000రూ నుండి 1,25,000రూ వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే అకడమిక్ మెరిట్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునమా..ది సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్ , ముషీరాబాద్, సికిందరాబాద్. దరఖాస్తులు పంపేందుకు ఏప్రిల్ 5, 2022ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.telangana.gov.in/సంప్రదించగలరు.