Railway Jobs : రైల్వేలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్, డిప్లోమాలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 18ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

Jobs

Railway Jobs : కేంద్రప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన జబల్ పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్నవెస్ట్ సెంట్రల్ రైల్వేలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ టెక్నికల్ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్, డిప్లోమాలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 18ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే స్క్రీనింగ్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది మార్చి 17, 2022, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://wcr.indianrailways.gov.in/ సంప్రదించగలరు.