IBPS: ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 13,217 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేయనుంది.

IBPS has released a notification for the recruitment of 13,217 posts in RRB.
IBPS: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే, ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ఖాళీగా ఉన్న 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21తో ముగియనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.ibps.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్స్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ దానికి సమానమైన విద్యలో అర్హత సాధించి ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-I: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ/ దానికి సమానమైన విద్యలో అర్హత ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-II: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-II:
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యలో కనీసం 50% మార్కులతో డిగ్రీని/ దానికి సమానమైన విద్యను పూర్తి చేసి ఉండాలి.
- లా ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా విద్యలో కనీసం 50% మార్కులతో డిగ్రీ/ దానికి సమానమైన విద్యలో అర్హత సాధించి ఉండాలి.
- చార్టెడ్ అకౌంటెంట్/ఫైనాన్స్ మేనేజర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ అసోసియేట్ /గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫైనాన్స్‌లో MBA పూర్తి చేసి ఉండాలి.
- మార్కెటింగ్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్‌లో MBA విద్యను పూర్చి చేసి ఉండాలి.
- అగ్రికల్చర్ ఆఫీసర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్/హార్టికల్చర్/డైరీ/యానిమల్ హస్బెండరీ/ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/పిసికల్చర్ విద్యలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/ దానికి సమానమైన విద్యలో అర్హత సాధించి ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/ దానికి సమానమైన విద్యలో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
- ఆఫీస్ అసిస్టెంట్స్ (బహుళ ప్రయోజన): పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్): పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబందించిన ఎంపిక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది:
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్) పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-2 & స్కేల్-3 పోస్టులకు సింగిల్ లెవల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.