ఉద్యోగ సమాచారం: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాల ఖాళీలు

లక్నోలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) యాక్ససరీస్ డివిజన్ టెన్యూర్ పద్ధతిలో 77 అసిస్టెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. అసిస్టెంట్-43
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్, క్యూసీ/ఇన్‌స్పెక్షన్, కమర్షియల్, సివిల్ వర్క్స్.
2. ఆపరేటర్-34
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లామా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: జనవరి 1, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2019.
వెబ్‌సైట్: https://hal-india.co.in/