Karnataka SET Admit Cards Out
Karnataka SET Admit Cards : కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (KEA) రాబోయే కర్ణాటక రాష్ట్ర అర్హత పరీక్ష (KSET) కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్‌లను అధికారిక కేఈఏ వెబ్‌సైట్ (kea.kar.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కెసెట్ రాత పరీక్ష నవంబర్ 24న షెడ్యూల్ అయింది. ఈ కెసెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే షిఫ్ట్‌లో 3 గంటల పాటు నిర్వహించనున్నారు.
కెసెట్ పరీక్షలో రెండు (పేపర్ I, పేపర్ II) పేపర్లు ఉంటాయి. పేపర్ ఒకటిలో 100 మార్కుల విలువైన 50 ఆబ్జెక్టివ్-టైప్ కంపల్సరీ ప్రశ్నలు ఉంటాయి. అయితే, పేపర్ II మొత్తం 200 మార్కులకు 100 ఆబ్జెక్టివ్-టైప్ కంపల్సరీ ప్రశ్నలను కలిగి ఉంటుంది. అభ్యర్థులు తమ సమాధానాలను పరీక్ష బుక్‌లెట్‌తో పాటు అందించిన ఆప్టికల్ మార్క్స్ రీడర్ (OMR) షీట్‌లో గుర్తు పెట్టుకోవచ్చు.
కెసెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :
కర్ణాటక ఎస్ఈటీ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ :
కెసెట్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, సైన్, ఫొటోగ్రాఫ్, రోల్ నంబర్, పరీక్ష తేదీ, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం పేరు, చిరునామాతో సహా అందులో జాబితా చేసిన వివరాలను జాగ్రత్తగా చెక్ చేయాలి. అదనంగా, అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా రోజు మార్గదర్శకాలను రివ్యూ చేయాలి. మొబైల్ ఫోన్‌లు, కాలిక్యులేటర్‌లు లేదా గాడ్జెట్‌లు వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అలాగే మార్కర్‌లు, పుస్తకాలు లేదా పేపర్ల వంటి వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష హాల్‌కు అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలి.
కెసెట్ పరీక్ష 2024 పాస్ మార్కులు :
జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రెండు పేపర్లలో కనీసం 40 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కింద వచ్చే అభ్యర్థులు, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో 35 శాతం సాధించాల్సి ఉంటుంది.
Read Also : iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. డిజైన్ వివరాలు ఇవే..!