Lakshmi Soumya: న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డుకు ఎంపిక అయిన లక్ష్మీ సౌమ్య
న్యూరోసైన్స్‌లో అద్భుతమైన నైపుణ్యాన్ని లక్ష్మికి ఉందని యూనివర్సిటీ హర్షం వ్యక్తం చేసింది. న్యూరోడీజెనరేటివ్ బ్రెయిన్ ( మెదడులో కణాల క్షీణత వ్యాధి)లోని B-Z ఆకృతి నుంచి DNA నిర్మాణంలో మార్పుకు సంబంధించి మార్గదర్శక అధ్యయనంపై ఆమె ప్రెజెంటేషన్ దృష్టి పెడుతుంది

New Investigator Travel Award: అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డును 2023 సంవత్సరానికిగానూ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్డీ విద్యార్థి లక్ష్మీ సౌమ్య ఈమని అందుకోవడానికి ఎంపికైనట్లు కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికాలో ఉన్న ఎన్విరాన్‌మెంటల్ మ్యూటాజెనిసిస్ అండ్ జెనోమిక్స్ సొసైటీ (EMGS) అవార్డులు & ఆనర్స్ కమిటీ ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసింది. 2023 సెప్టెంబరులో చికాగోలో జరుపనున్న అవార్డు వేడుకలో లక్ష్మి తన విప్లవాత్మక పరిశోధనలను ప్రదర్శించే అవకాశం ఉంది.
న్యూరోసైన్స్‌లో అద్భుతమైన నైపుణ్యాన్ని లక్ష్మికి ఉందని యూనివర్సిటీ హర్షం వ్యక్తం చేసింది. న్యూరోడీజెనరేటివ్ బ్రెయిన్ ( మెదడులో కణాల క్షీణత వ్యాధి)లోని B-Z ఆకృతి నుంచి DNA నిర్మాణంలో మార్పుకు సంబంధించి మార్గదర్శక అధ్యయనంపై ఆమె ప్రెజెంటేషన్ దృష్టి పెడుతుంది. ఆమె పరిశోధన మనిషిని బలహీనపరిచే పరిస్థితులైన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులకు కారణమయ్యే మెదడులో కణాల క్షీణతకు సంబంధించి ఈ నిర్మాణాత్మక మార్పు యొక్క సంభావ్య ప్రభావాన్ని ప్రతిపాదిస్తుంది.
జపాన్‌లోని ప్రతిష్టాత్మక సంస్థలైన OIST వంటి వాటితో కలిసి లక్ష్మి పని చేసింది. ISN ట్రావెల్ అవార్డును అందుకోవటానికి ఆమె అమెరికాకు వెళ్ళనున్నారు. మెదడు రహస్యాలను లోతుగా పరిశోధించడానికి, మెదడు సమస్యలపై మరింత అవగాహన పొందడానికి పారిస్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్, ఇతర ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేయాలని లక్ష్మి భావిస్తున్నారు.