MRPL Recruitment : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
MRPL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో మొత్తం 50 నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించరాదు.
అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25000 నుంచి రూ. 86,400 వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 16 జూన్ 2023తో గడువు ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.mrpl.co.in/ పరిశీలించగలరు.