NABARD Jobs : వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ లో పలు పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇదంతా అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఫేట్ 2 లో మెయిన్ పరిక్ష ఉంటుంది.

NABARD Jobs : వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ లో పలు పోస్టుల భర్తీ

Rural Development Bank

Updated On : September 13, 2023 / 11:57 AM IST

NABARD Jobs : కేంద్ర జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్‌ ఏ ఆఫీసర్‌ ఆసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వెంటనే నెలవారీ వేతనంగా లక్షరూపాయలు పొందవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Technologies In Agriculture : వ్యవసాయ పనులు చేస్తున్న రోబో.. రెండు రూపాయల ఖర్చుతోనే ఎకరంలో కలుపుతీత

మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే జనరల్‌, కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ ట్నాలజీ 40, ఫైనాన్స్‌ 15, కంపెనీ సెక్రటరీ 8, సివిల్‌ ఇంజినీరింగ్‌ 8, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 8, జియో ఇన్ఫర్మాటిక్స్‌ ఓ ఫారెస్ట్రీ 2, పుడ్‌ ప్రాసెసింగ్‌ 2 స్టాటిస్టిక్స్‌ 2 మాస్‌ కమ్యూనికేషన్‌ 1 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులైతే 55 శాతం ఉత్తీర్ణత మార్కులు సరిపోతాయి. లేదంటే ఎంబీఏ,పేజీడీఎంలో 55 శాతం మార్కులు పొందినవారూ సైతం అర్హులే. ఎస్సీ ఎస్టీ, .. దివ్యాంగులు 50 శాతం ఉంటే సరిపోతుంది. మిగిలిన పోస్టులకు సంబంధిత డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉన్నవారంతా అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

READ ALSO : Drones In Agriculture : డ్రోన్, వరినాటే యంత్రాలకు.. సబ్సిడీ 50 శాతం

అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇదంతా అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఫేట్ 2 లో మెయిన్ పరిక్ష ఉంటుంది. ఈ పరీక్ష అబ్జెక్టీవ్, డిస్క్రిప్టివ్ విధానాల్లో ఉంటుంది. ఫేజ్ 2 సాధించి మెరిట్ మార్కుల అధారంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూ కు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల అధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షకు సంబంధించి సిలబస్‌ వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

READ ALSO : Lucky spiders : ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం .. మహిళకు తగిలిన బంపర్ లాటరీ

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా సెప్టెంబరు 23, 2023ను నిర్ణయించారు. ఫేజ్ 1 ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 16న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nabard.org పరిశీలించగలరు.