భారత హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు
భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రక్షణదళ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయసు ఉద్యోగాలను బట్టి నిర్ణయిస్తారు.
విభాగాలు:
పోస్టులు | ఖాళీలు |
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ | 04 |
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్) | 175 |
మెడికల్ ఆఫీసర్లు | 317 |
మొత్తం ఖాళీలు |
496 |
ఎంపిక విధానం: పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజు అవసరం లేదు.
దరఖాస్తుకి చివరి తేదీ: మే 1, 2019.