మే 5న నీట్ ఎగ్జామ్..పాటించాల్సిన సూచనలు ఇవే!

మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. అభ్యర్థులు పరీక్ష రోజు వరకూ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు..
* గంట ముందే అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 12.30 నుంచి విద్యార్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు. 1.30 దాటితే అనుమతించరు. అంతేకాదు అభ్యర్థులు ఖచ్చితంగా హాల్‌టికెట్ తెచ్చుకోవాలి.
* హాల్‌టికెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఓటర్ ఐడీ, పాన్, ఆధార్ వెంటతీసుకొచ్చుకోవాలి.
* ఎలక్ట్రానిక్ వస్తువులకి అనుమతి లేదు. ఆభరణాలు, విలువైన పరికరాలు భద్ర పరిచేందుకు వీలుండదు.. కాబట్టి అలాంటివి ఎగ్జామ్ హాల్‌కి తీసుకెళ్లకపోవడం మంచిది. కళ్లద్దాలు (సన్ గ్లాసెస్), చేతి సంచులు వంటి వస్తువులు కూడా అనుమతించారు.